డిసెంబర్ 18న హోండా యునికార్న్ 160సీసీ బైక్ విడుదల

By Ravi

జపాన్‌కి చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ), దేశీయ విపణిలో విక్రయిస్తున్న 150సీసీ బైక్, యునికార్న్‌కు ఎగువన కంపెనీ మరో కొత్త పవర్‌ఫుల్ వేరియంట్‌ను (160సీసీ ఇంజన్‌తో) ప్రవేశపెట్టనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, హోండా యునికార్న్ 160సీసీ బైక్‌ను డిసెంబర్ 18, 2014వ తేదీన మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం. హోండా అధీకృత టూవీలర్ డీలర్లు ఇప్పటికే ఈ కొత్త యునికార్న్ బైక్ కోసం బుకింగ్‌లను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. దేశీయ మార్కెట్లో దీని ధర రూ.65,000-రూ.70,000 మధ్యలో ఉండొచ్చని అంచనా.

ప్రస్తుత యునికార్న్ 150తో పోల్చుకుంటే కొత్త యునికార్న్ 160 మరింత మోడ్రన్ డిజైన్‌ని కలిగి ఉండనుంది. కంపెనీ విక్రయిస్తున్న హోండా సిబి ట్రిగ్గర్ డిజైన్, కాంపోనెంట్స్‌ను ఈ కొత్త యునికార్న్ 160లో షేర్ చేసే అవకాశం ఉంది. ఇది ఈ సెగ్మెంట్లో సుజుకి జిక్సర్, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 వంటి మోడళ్లకు పోటీగా పడనుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Honda Unicorn

More from DriveSpark

Article Published On: Monday, December 15, 2014, 14:00 [IST]
English summary
Honda Motorcycle & Scooters India Pvt. Ltd. (HMSI) is all set to launch the much-awaited Unicorn 160 in the Indian market on December 18, 2014. Stay tuned for latest updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+