హోండా సిబి125ఎఫ్ - హోండా కొత్త 125సీసీ బైక్
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా, ప్రస్తుతం భారత ద్విచక్ర వాహన మార్కెట్లో 125సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో హోండా షైన్ బైక్‌ను ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసినదే. హోండా షైన్ సింపుల్ డిజైన్‌తో ఎగ్జిక్యూటివ్ లుక్‌ని కలిగి ఉంటుంది. అయితే, ఈ సెగ్మెంట్లో కాస్తంత స్పోర్టీ లుక్, ప్రీమియం ఫీచర్స్ కోరుకునే వారిని మాత్రం హోండా తమ షైన్‌తో నిరుత్సాహపరిచిందనే చెప్పాలి.
అందుకే, అలాంటి కస్టమర్ల కోసం హోండా ఓ సరికొత్త 125సీసీ బైక్‌ను ఆవిష్కరించింది. హోండా సిబి125ఎఫ్ (Honda CB125F) పేరుతో కంపెనీ ఆవిష్కరించిన ఈ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను స్టయిలిష్, స్పోర్టీ, ప్రీమియంగా డిజైన్ చేశారు. ఈ బైక్ ముందుగా యారోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ తర్వాత భారత మార్కెట్లో విడుదలయ్యే ఆస్కారం ఉంది.

మోటార్‌సైకిల్ లైవ్ కార్యక్రమంలో హోండా తమ కొత్త సిబి125ఎఫ్ బైక్‌ని ప్రదర్శనకు ఉంచింది. హోండా భారత మార్కెట్లో విక్రయిస్తున్న సిబి ట్రిగ్గర్ మోటార్‌సైకిల్ నుంచి ఈ కొత్త సిబి125ఎఫ్ బైక్‌ని రూపొందించారు. హోండా సిబి125ఎఫ్ ఒక నేక్డ్ బైక్. యూరప్ మార్కెట్లో ఇది సిబి300ఎఫ్, సిబి500ఎఫ్ వంటి సిబి రేంజ్ మోడళ్ల సరసన చేరనుంది.
హోండా సిబి125ఎఫ్ బైక్‌లో 124.7సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.5 హార్స్‌పవర్‌ల శక్తిని, 11.35 న్యూటన్ మీటర్ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. బెటర్ మైలేజ్ కోసం హోండా దీని పవర్ అవుట్‌పుట్‌ని తగ్గించింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం ఇది లీటరుకు 42.68 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

సరికొత్త షాషీపై హోండా సిబి125ఎఫ్ మోడల్‌ను తయారు చేశారు. బ్యాలన్సర్ షాఫ్ట్‌తో కూడిన ఈ షాషీ బైక్ వైబ్రేషన్‌ను తగ్గిస్తుంది. ఈ బైక్‌లో 6-స్పోక్ 18-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇంప్రూవ్డ్ థ్రోటల్ రెస్పాన్స్ అండ్ యాక్సిలరేషన్ వంటి మార్పులు ఉన్నాయి.
హోండా తమ సిబి125ఎఫ్ ధరను ఇంకా వెల్లడించలేదు. మరికొద్ది రోజుల్లోనే ఇది యూరోపియన్ మార్కెట్లలో విడుదల కానుంది. ఆ సమయంలో కంపెనీ దీని ధరను ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది (2015)లో ఇది భారత మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా. లేటెస్ట్ అప్‍డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








