హోండా డియో, డ్రీమ్ నియో మోడళ్లలో రిఫ్రెష్డ్ వెర్షన్స్

By Ravi

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఈ ఏడాది మొత్తం 15 మోడళ్లను మార్కెట్లో విడుదల చేయనుంది. వీటిలో కొన్ని సరికొత్త మోడళ్లు అలాగే కొన్ని రిఫ్రెష్డ్ మోడళ్లు ఉంటాయి. గడచిన జనవరిలో సరికొత్త సిబి యునికార్న్ 160 బైక్‌ను, ఫిబ్రవరిలో కొత్త యాక్టివా 3జి స్కూటర్‌ను విడుదల చేసిన కంపెనీ, తాజాగా మరో రెండు రిఫ్రెష్డ్ మోడళ్లను విడుదల చేసింది.

యాక్టివా 3జి స్కూటర్‌ని విడుదల చేసినప్పుడు హోండా ప్రదర్శనకు ఉంచిన రిఫ్రెష్డ్ డియో స్కూటర్, డ్రీమ్ నియో మోటార్‌సైకిళ్లను హోండా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అప్‌డేటెడ్ డియో స్కూటర్ డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లు, రిఫ్రెష్డ్ గ్రాఫిక్స్‌తో లభ్యం కానుంది. ఇంజన్ పరంగా కొత్త హోండా డియో స్కూటర్‌లో ఎలాంటి మార్పులు లేవు. విపణిలో దీని ధర రూ.47,851 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Honda Updates Dio And Dream Neo Models

ఇక హోండా డ్రీమ్ నియో విషయానికి వస్తే.. ఈ మోటార్‌సైకిల్ బాడీ గ్రాఫిక్స్‌ను కూడా మార్చారు. ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ కౌల్, సైడ్ ప్యానెళ్లపై కొత్త బాడీ గ్రాఫిక్స్, రెడ్ హోండా లోగో, కొత్త లాకబల్ సైడ్ కౌల్ వంటి మార్పులు ఉన్నాయి. డ్యూయెల్ టోన్ బాడీ కలర్ ఆప్షన్ ఇందులో కూడా అందుబాటులో ఉంది. విపణిలో ఈ రిఫ్రెష్డ్ డ్రీమ్ నియో ధర రూ.49,034 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కాగా.. ఈ రెండు మోడళ్లలో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ మినహా ఎలాంటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. త్వరలోనే రిఫ్రెష్డ్ డ్రీమ్ యుగ, సిబి షైన్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసేందుకు హోండా సన్నాహాలు చేస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Honda Motorcycle and Scooter India has updated its Dio scooter and Dream Neo motorcycles for 2015. These two models now available in dual tone body colour option.
Story first published: Monday, March 30, 2015, 16:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X