విద్యార్థుల టాలెంట్: పెట్రోల్, బ్యాటరీ పవర్‌తో నడిచే హైబ్రిడ్ బైక్
ఇప్పటి వరకు మనం హైబ్రిడ్ కార్ల (పెట్రోల్ లేదా డీజిల్ పవర్‌తో పాటు బ్యాటరీ పవర్‌తో నడిచేవి) గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా, హైబ్రిడ్ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు ఉన్నప్పటికీ, అవి కాన్సెప్టులకు మాత్రమే పరిమితం అయ్యాయి. అయితే, గ్రేటర్ నోయిడాకు చెందిన మన ఇంజనీరింగ్ విద్యార్థులు దీనిని నిజం చేసి చూపించారు. అటు పెట్రోల్‌తోను ఇటు బ్యాటరీతోను నడిచే హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌ను సృష్టించారు. జిఎన్ఐఓటి (గ్రేటర్ నోయిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.
పాత హీరో హోండా ప్యాషన్ మోటార్‌సైకిల్‌కు వెనుకవైపు చిన్న 12 వోల్ట్ 20 ఆంప్స్ బ్యాటరీని, ఇంజన్ దగ్గర ఓ ఎలక్ట్రిక్ మోటార్‌ను మరియు ఆల్టర్నేటర్‌ను అమర్చి కస్టమైజ్ చేశారు. ఈ హైబ్రిడ్ బైక్ ప్రత్యేకత ఏంటంటే, రద్దీగా లేని సాధారణ రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు బైక్ చైన్ తిరగటం ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తిని విద్యుత్‌గా మార్చేందుకు ఓ పరికరాన్ని ఇందులో అమర్చారు.
ఈ పరికరం ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు సాయంతో బైక్‌కు వెనుక భాగంలో అమర్చిన బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. బైక్ ఎప్పుడైతే రద్దీగా ఉండే రోడ్లు, లేదా ఇరుకుగా ఉండే రోడ్లపైకి ప్రవేశిస్తుందో అప్పుడు పెట్రోల్ ఇంజన్ ఆఫ్ అయిపోయి బ్యాటరీ సాయంతో మోటార్ ద్వారా ఇది పనిచేయటం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో పెట్రోల్ వినియోగం ఉండదు. ఈ విధంగా పెట్రోల్‌ను 12-15 శాతానికి పైగా ఆదా చేసుకోవచ్చని విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ హైబ్రిడ్ బైక్ ప్రయోగ దశలో ఉంది.

గ్రేటర్ నోయిడా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు పెట్రోల్, బ్యాటరీ పవర్‌తో నడిచే హైబ్రిడ్ బైక్‌ను రూపొందించారు.

తాము సృష్టించిన హైబ్రిడ్ బైక్ పనితీరును గురించి వివరిస్తున్న ఓ విద్యార్థి.

ఈ బైక్ గురించి సెమినార్‌లో ప్రసంగిస్తున్న మరో విద్యార్థి.

ఈ హైబ్రిడ్ బైక్ సృష్టికర్తలు వీరే

పెట్రోల్ బైక్‌లను అనుమతించని ఈకో జోన్లలో సైతం ఈ బైక్‌ను తీసుకొని వెళ్లవచ్చు.

బైక్ పనితీరును వివరిస్తున్న ఇంజనీరింద్ విద్యార్థి.

బైక్ వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్, ఆల్టర్నేటర్.

హైబ్రిడ్ బైక్‌తో విద్యార్థుల బృందం.




Click it and Unblock the Notifications








