ఆటో ఎక్స్‌పో 2014: హ్యోసంగ్ ఆక్విలా జివి250 విడుదల
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హ్యోసంగ్, భారత మార్కెట్లో ఓ కొత్త 250సీసీ క్రూజర్ స్టైల్ బైక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గతంలో మన పలు కథనాల్లో చదువుకున్నాం. తాజాగా.. డిఎక్‌కే మోటోవీల్స్ 'హ్యోసంగ్ ఆక్విలా జివి250' మోటార్‌సైకిల్‌ను భారత్‌కు పరిచయం చేసింది.
ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ కొత్త లో బడ్జెట్ క్రూజర్ బైక్‌ను విడుదల చేసింది. గతంలో కంపెనీ విడుదల చేసిన జివి650 బైక్‌కు దిగువన అదే సిరీస్‌లో తక్కువ ఇంజన్ సామర్థ్యంతో ఈ బైక్‌ను తయారు చేశారు. హ్యోసంగ్ ఆక్విలా జివి250 బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హ్యోసంగ్ జివి250లో 250సీసీ, ఆయిల్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 28 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జచేయబడి ఉంటుంది.

హ్యోసంగ్ తమ జివి250 బైక్‌ను స్థానికంగానే అసెంబ్లిగ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఫలితంగా ఇది సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది.

భారత మార్కెట్లో హ్యోసంగ్ ఆక్విలా జివి250 బైక్ ధర రూ.2.5 లక్షలు ఉండొచ్చని అంచనా.

వాస్తవానికి ఈ బైక్ చాలా రోజుల క్రితమే భారత మార్కెట్లో విడుదల కావల్సి ఉన్నప్పటికీ, కానీ కొన్ని అంతర్గత కారణాల వలన దీని విడుదల జాప్యం జరుగుతూ వస్తోంది.

హ్యోసంగ్ తొలుత భారత్‌లో పూనేకు చెందిన గార్వారే మోటార్స్‌తో ఒప్పందం కుదుర్చుకొని కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసినదే. అయితే, ఆ తర్వాత ఇరు సంస్థల మధ్య తలెత్తిన సమస్యల కారణంగా ఈ వెంచర్‌ను పూనేకు చెందిన మరొక సంస్థ డిఎస్‌కే మోటోవీల్స్‌ను హ్యోసంగ్ ఆశ్రయించింది.

డిఎస్‌కే మోటోవీల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత హ్యోసంగ్‌కు దేశీయ మార్కెట్లో బాగా కలిసొచ్చింది.


Click it and Unblock the Notifications








