హ్యోసంగ్ నుంచి మరో 2 బైక్స్: జిటి250 కామెట్, జిడి 250ఎన్
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ 'హ్యోసంగ్' (Hyosung) భారత మార్కెట్లో మరో రెండు సరికొత్త 250సీసీ బైక్‌లను విడుదల చేయనుంది. ఇటీవలే బెంగుళూరులో తమ రెండవ షోరూమ్‌ను ప్రారంభించిన సందర్భంగా డిఎస్‌కే హ్యోసంగ్ చైర్మన్ శిరీష్ కులకర్ణి ఈ విషయాన్ని వెల్లడించారు.
హ్యసంగ్ జిటి250 కామెట్ మరియు హ్యోసంగ్ జిడి 250ఎన్ అనే రెండు కొత్త 250సీసీ బైక్‌లను కంపెనీ విడుదల చేయనుంది. ఇటీవలే ముగిసిన 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో హ్యోసంగ్ ఈ రెండు బైక్‌లను ప్రదర్శనకు కూడా ఉంచింది.
హ్యసంగ్ జిటి250 కామెట్, హ్యోసంగ్ జిడి 250ఎన్ రెండు మోడళ్లు అక్టోబర్ 2014 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ బైక్‌లకు సంబంధించిన ఫొటోలు మరియు మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

హ్యోసంగ్ జిడి 250ఎన్
ఇదొక కెటిఎమ్ డ్యూక్ రేంజ్‌ను పోలి ఉండే నేక్డ్ స్ట్రీట్ స్పోర్ట్ బైక్. హ్యోసంగ్ జిడి250ఎన్‌లో ముందు వైపు 37 మి.మీ. ఇన్వెర్టెడ్ ఫోర్డ్ అప్ ఫ్రంట్ మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్లను అమర్చారు. దీని మొత్తం బరువు 145 కేజీలు. సికెడి రూట్లో దీనిని కూడా భారత మార్కెట్లోనే అసెంబ్లింగ్ చేసే అవకాశాలున్నాయి. భారత మార్కెట్లో దీని ధర రూ.1.75 లక్షలు ఉండొచ్చని అంచనా.

హ్యోసంగ్ జిడి 250ఎన్
హ్యోసంగ్ జిడి250ఎన్ బైక్‌లో 249సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 28 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జచేయబడి ఉంటుంది. ఇందులో 17 ఇంచ్ వీల్స్, 300 మి.మీ. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 230 మి.మీ. రియర్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.

హ్యోసంగ్ జిటి250 కామెట్
ఇకపోతే హ్యాసంగ్ నుంచి రానున్న రెండవ ఉత్పత్తి 'జిటి250 కామెట్'. దాదాపు దశాబ్ధం క్రితం కైనెటిక్ ఈ స్ట్రీట్ ఫైటర్ స్టైల్ బైక్‌ను ఇండియాకు పరిచయం చేసింది. అప్పట్లో సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో దీనిని ఇండియాకు దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయించే వారు. అయితే, విడిభాగాల సమస్య వలన ఇది భారత్‌లో విజయం సాధించలేకపోయింది.

హ్యోసంగ్ జిటి250 కామెట్
హ్యోసంగ్ జిటి250 కామెట్ బైక్‌లో 248సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 10,500 ఆర్‌పిఎమ్ వద్ద 30 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 7300 ఆర్‌పిఎమ్ వద్ద 20 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది హ్యోసంగ్ జిడి 250ఆర్ బైక్‌కు నేక్డ్ వెర్షన్.


Click it and Unblock the Notifications








