భారత్‌కు వస్తున్న హ్యోసంగ్ జివి250 క్రూయిజర్ బైక్

By Ravi

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హ్యోసంగ్ ఇటీవలే భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన జివి650 బైక్ విజయం సాధించిన నేపథ్యంలో, మరికొత్త బైక్‌‌ను విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. జివి సిరీస్‌లో తక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన ఓ లీజర్ బైక్‌ను హ్యోసంగ్ విడుదల చేయనుంది. భారత్‌లో పూనేకు చెందిన డిఎస్‌కే మోటోవీల్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత హ్యోసంగ్‌కు దేశీయ మార్కెట్లో బాగా కలిసివచ్చింది.

హ్యోసంగ్ జివి650 భారత మార్కెట్లో విడుదలైన కేవలం 10 నెలల్లోనే 1260 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో, హ్యోసంగ్ తమ జివి250 మోటార్‌‌సైకిల్‌ను భారత మార్కెట్లో మరికొద్ది రోజుల్లోనే విడుదల చేయాలని యోచిస్తోంది. జివి650 మరియు జివి250 మోటార్‌సైకిళ్లు 800సీసీ ఇంజన్ సామర్థ్యం కన్నా తక్కువ ఉండి, అధనపు ఎక్సైజ్ సుంకాల పరిధిలోకి రావు. కాబట్టి, త్వరలో మార్కెట్లోకి రానున్న హ్యోసంగ్ జివి250 బైక్ కూడా సరసమైన ధరకే లభించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.

హ్యోసంగ్ జివి250లో ఉపయోగించిన 250సీసీ, ఆయిల్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్ గరిష్టంగా 28 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేయనుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జచేయబడి ఉంటుంది. జివి250 బైక్‌ను హ్యోసంగ్ స్థానికంగానే అసెంబ్లిగ్ చేయనుంది. కాబట్టి దీని ధర రూ.2.5 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. హ్యోసంగ్ జివి250కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి. ఈలోపుగా ఈ బైక్ ఫొటోను తిలకిద్దాం రండి..!

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

హ్యోసంగ్ జివి250 క్రూయిజర్

More from DriveSpark

Article Published On: Saturday, June 1, 2013, 13:07 [IST]
English summary
Following the success of the GV650 cruiser bike South Korean motorcycle manufacturer Hyosung and its Indian partner DSK Motorwheels have decided to introduce the quarter liter model, GV250 for Indian motorcycle enthusiasts.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+