హ్యోసంగ్ ఆక్విలా జివి650, 2013 జిటి650ఆర్‌ బైక్‌లను విడుదల

హ్యోసంగ్ ఆక్విలా క్రూయిజ్ బైక్ ఇండియాకు రావటం గురించి గతంతో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ప్రచురించినట్లుగానే, నేడు డిఎస్‌కే మోటోవీల్స్ తమ సరికొత్త హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 క్రూయిజ్ మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది. అంతేకాకుండా, ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న జిటి650ఆర్ స్పోర్ట్స్ బైక్‌లో కూడా ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. భారత మార్కెట్లో హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 ధర రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా ఉండగా, 2013 హ్యోసంగ్ జిటి650ఆర్ ధర రూ.4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా ఉన్నాయి.

సరికొత్త 2013 హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 క్రూయిజ్ మోటార్‌సైకిల్‌లో హ్యోసంగ్ జిటి650ఆర్‌లో ఉపయోగించిన 650సీసీ లిక్విడ్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పిల శక్తిని, 62 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. డిజిటల్ డిస్‌ప్లే, లైట్-వెయిట్ అల్లాయ్ వీల్స్, రియర్ డిస్క్ బ్రేక్, అడ్జస్టబల్ 43 ఎమ్ఎమ్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ వంటివి ఈ బైక్‌లో చెప్పుకోదగిన ఫీచర్లు. దీని స్టయిలింగ్‌ను చూస్తే ఇది హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న వి-రాడ్ మోటార్‌సైకిల్‌ను పోలి ఉంటుంది.

ఇక 2013 హ్యోసంగ్ జిటి650ఆర్ స్పోర్ట్స్ బైక్ విషయానికి వస్తే ఇందులో యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు లేవు. కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, కొత్త ఎయిర్ డ్యామ్, సరికొత్త ఇన్‍‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి కొన్ని కాస్మోటిక్ మార్పులతో కంపెనీ ఈ బైక్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో ఉపయోగించిన 650సీసీ లిక్విడ్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పిల శక్తిని, 61 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. ఈ బైక్‌ను సికెడి రూట్లో దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకొని భారత్‌లో అసెంబ్లింగ్ చేస్తున్న కారణంగా దీనిని 4.69 లక్షలకే కంపెనీ ఆఫర్ చేస్తోంది.

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

డిఎస్‌కే మోటోవీల్స్ తమ సరికొత్త హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 క్రూయిజ్ మోటార్‌సైకిల్‌ను దేశీయ విపణిలో విడుదల చేసింది.

2013 హ్యోసంగ్ జిటి650ఆర్

2013 హ్యోసంగ్ జిటి650ఆర్

హ్యోసంగ్ ప్రస్తుతం దేశీయ విపణిలో అందిస్తున్న జిటి650ఆర్ స్పోర్ట్స్ బైక్‌లో కూడా ఓ కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 - ధర

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 - ధర

భారత మార్కెట్లో హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 ధర రూ.4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా ఉంది.

2013 హ్యోసంగ్ జిటి650ఆర్ - ధర

2013 హ్యోసంగ్ జిటి650ఆర్ - ధర

భారత మార్కెట్లో 2013 హ్యోసంగ్ జిటి650ఆర్ ధర రూ.4.69 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా ఉంది.

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

సరికొత్త 2013 హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650 క్రూయిజ్ మోటార్‌సైకిల్‌లో హ్యోసంగ్ జిటి650ఆర్‌లో ఉపయోగించిన 650సీసీ లిక్విడ్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పిల శక్తిని, 62 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

2013 హ్యోసంగ్ జిటి650ఆర్

2013 హ్యోసంగ్ జిటి650ఆర్

ఇక 2013 హ్యోసంగ్ జిటి650ఆర్ స్పోర్ట్స్ బైక్ విషయానికి వస్తే ఇందులో యాంత్రికపరంగా ఎలాంటి మార్పులు లేవు. కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, కొత్త ఎయిర్ డ్యామ్, సరికొత్త ఇన్‍‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి కొన్ని కాస్మోటిక్ మార్పులతో కంపెనీ ఈ బైక్‌ను అప్‌గ్రేడ్ చేసింది.

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

హ్యోసంగ్ ఆక్విలా ప్రో జివి650

డిజిటల్ డిస్‌ప్లే, లైట్-వెయిట్ అల్లాయ్ వీల్స్, రియర్ డిస్క్ బ్రేక్, అడ్జస్టబల్ 43 ఎమ్ఎమ్ అప్‌సైడ్-డౌన్ ఫోర్క్ వంటివి ఈ బైక్‌లో చెప్పుకోదగిన ఫీచర్లు. దీని స్టయిలింగ్‌ను చూస్తే ఇది హ్యార్లీ డేవిడ్‌సన్ అందిస్తున్న వి-రాడ్ మోటార్‌సైకిల్‌ను పోలి ఉంటుంది.

2013 హ్యోసంగ్ జిటి650ఆర్

2013 హ్యోసంగ్ జిటి650ఆర్

2013 హ్యోసంగ్ జిటి650ఆర్‌లో ఉపయోగించిన 650సీసీ లిక్విడ్-కూల్డ్, వి-ట్విన్ ఇంజన్‌నే ఉపయోగించారు. ఇది గరిష్టంగా 72 బిహెచ్‌పిల శక్తిని, 61 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మాత్రం 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది.

Hyosung Aquila Pro GV650 & 2013 GT650R

Hyosung Aquila Pro GV650 & 2013 GT650R

Hyosung Aquila Pro GV650 & 2013 GT650R

Hyosung Aquila Pro GV650 & 2013 GT650R

More from DriveSpark

Article Published On: Wednesday, January 16, 2013, 14:58 [IST]
English summary
DSK MotoWheels (Hyosung's Indian partner) has launched new Aquila Pro GV650 and 2013 GT650R motorcycles in India. Hyosung Aquila Pro GV650 is priced at Rs.4.99 lakhs (ex-showroom, Delhi) and 2013 Hyosung GT650R is priced at Rs.4.69 lakhs (ex-showroom, Delhi).
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+