ఇండియా బైక్ వీక్ 2014 తేదీలు వెల్లడి

By Ravi

మనకు దసెరా, దీపావళి ఎలాగో, బైకర్లకు ఇండియా బైక్ వీక్ అలాగ. భారతదేశపు అతిపెద్ద బైకర్ ఫెస్టివల్ 'ఇండియా బైక్ వీక్' 2014 ఎడిషన్ తేదీలు వెల్లడయ్యాయి. గడచిన సంవత్సరంలో నిర్వహించిన మొదటి ఎడిషన్ సక్సెస్ కావటంతో, నిర్వాహకులు వచ్చే ఏడాది ఆరంభంలో నిర్వహించనున్న కార్యక్రమాల తేదీలను వెల్లడించారు.

భారత్‌లోని సెవంటీ ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ ట్రావెలర్ సంస్థలు గోవాలో జనవరి 17 మరియు 18, 2014 తేదీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇండియా బైక్ వీక్ 2014కు దేశవ్యాప్తంగానే కాకుండా, ఇతర ప్రదేశాల నుంచి కూడా దాదాపు 10,000 మంది బైకర్లు వస్తారని అంచనా.

ప్రపంచంలోని అతిపెద్ద మోటార్‌సైకిల్ కార్యక్రమాల్లో ఒకటైన, అమెరికాలోని సౌత్ డకోటాలో నిర్వహించే వార్షిక 'స్టుర్గిస్ మోటార్‌సైకిల్ ర్యాలీ' నుంచి స్ఫూర్తి పొంది ఇండియా బైక్ వీక్ కార్యక్రమాన్ని ఈ ఏడైది ప్రారంభించారు. ఇందులో వేలాది మంది బైకర్లు తమ కెఫే రేసర్ల నుంచి స్క్రాంబర్ల వరకు అలా క్రూజర్ల నుంచి సూపర్‌బైక్‌ల వరకు బైక్‌లతో పండుగ చేసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇండియా బైక్ వీక్

మొదటి ఎడిషన్ ఇండియా బైక్ వీక్ కార్యక్రమానికి సుమారు 3,000 లకు పైగా బైక్‌లతో 6,547 మంది మోటారిస్టులు పాల్గొన్నారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళా రైడర్లు కూడా ఉన్నారు.

ఇండియా బైక్ వీక్

ఇదివరకటి ఎడిషన్‌వో 3 కాన్సెర్ట్ స్టేజ్‌లు, 28 లైవ్ బ్యాండ్లు మరియు డిజేలు, 5 బార్లు, 16 కేజ్ ఫైటర్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను నిర్వహించారు. ఈ ఏడాది వీటి పరిమాణం మరింత పెరిగే ఆస్కారం ఉంది.

ఇండియా బైక్ వీక్

ఈ కార్యక్రమంలో బైకర్ల బృందం తమ బైక్‌లతో చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంటాయి. గడచిన సంవత్సరం నిర్వహించిన ఇండియా బైక్ వీక్ 2012 ఎడిషన్‌లో అంతర్జాతీయ స్టంట్ స్పెషలిస్ట్ మాటీ గ్రిఫ్ఫిన్ కూడా పాల్గొన్నారు.

ఇండియా బైక్ వీక్

ఈ కార్యక్రమానికి మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇందులో అనేక కస్టమ్, ఎగ్జోటిక్ బైక్‌లను చూసే అవకాశం ఉంటుంది. గడచిన సంవత్సరం వై2కె టర్బైన్ ఇంజన్డ్ బైక్‌ను ప్రదర్శనకు ఉంచారు.

ఇండియా బైక్ వీక్

రెండు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో కొత్త బైక్‌లు, ఉత్పత్తులు, యాక్ససరీలను కూడా విడుదల చేయటం జరుగుతుంది. బైక్ ప్రియుల కోసం ప్రత్యేక మార్కెట్ కూడా ఉంటుంది.

ఇండియా బైక్ వీక్

బైక్ ఇండియా 2014 టికెట్ ధర ప్రతి వ్యక్తికి రూ.3,000, అక్టోబర్ 31 వరకు 10 శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుంది. మొదటి 1500 మంది కొనుగోలుదారులు ఐబిడబ్ల్యూ టి-షర్ట్స్‌‌ను కూడా పొందొచ్చు.

ఇండియా బైక్ వీక్

ఈ టికెట్లను in.bookmyshow.com ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు లేదా దేశవ్యాప్తంగా ఉన్న హ్యార్లీ డేవిడ్‌సన్ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాల్లో వీటిని పొందవచ్చు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 1, 2013, 15:15 [IST]
English summary
Dates for the second edition of India's largest biker festival, India Bike Week 2014 have been announced. The event organised by Seventy Event Media Group and FOX Traveller will take place in Goa on January 17 and 18 in 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+