ఇండియా బైక్ వీక్ 2014 స్పెషల్: బికినీ బైక్ వాష్

By Ravi

జనవరి 17, 18వ తేదీలలో గోవాలో జరిగిన ఇండియన్ బైకర్స్ ఫెస్టివల్ 'ఇండియా బైక్ వీక్' 2014 ఎడిషన్ మునుపటి కన్నా అంగరంగ వైభవంగా జరిగింది. భారత్‌లోని 70 ఈవెంట్ మీడియా గ్రూప్, ఫాక్స్ ట్రావెలర్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక ఆకర్షణలు చూపరులను ఆకట్టున్నాయి. ఆహారపానీయాలు మొదలుకొని స్టంట్‌లు గేమింగ్‌ల వరకు అదుర్స్ అనిపించాయి.

రెండవ ఎడిషన్ ఇండియా బైక్ వీక్ సుమారు 8,000 మందికి పైగా బైకర్లు హాజరైనట్లు అంచనా. ఇది గడచిన సంవత్సరం వచ్చిన వారి సంఖ్య కన్నా అధికం. ఈ ఏడాది మునుపటి సంవత్సరం ఎక్కువ మంది బైక్ ప్రియులు ఇందులోపాల్గొన్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా ఔత్సాహికులు ఈ కార్యక్రమాన్ని హాజరయ్యారు.

ముఖ్యంగా హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్ యజమానులు సుదూర ప్రాంతాల నుంచి గ్రూపులుగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. గడచిన సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బికినీ బైక్ వాష్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆ స్పెషాలిటీ ఫొటోలను ఈ కథనంలో పరిశీలిద్దాం రండి.

Bikini Bike Wash

ఇండియా బైక్ వీక్ 2014లో బికినీ బైక్ వాష్. ప్రపంచంలోని అతిపెద్ద మోటార్‌సైకిల్ కార్యక్రమాల్లో ఒకటైన, అమెరికాలోని సౌత్ డకోటాలో నిర్వహించే వార్షిక 'స్టుర్గిస్ మోటార్‌సైకిల్ ర్యాలీ' నుంచి స్ఫూర్తి పొంది ఇండియా బైక్ వీక్ కార్యక్రమాన్ని గడచిన సంవత్సరంలో తొలిసారిగా భారత్‌లో ప్రారంభించారు.

Bikini Bike Wash

ఇండియా బైక్ వీక్‌లో వేలాది మంది బైకర్లు తమ కెఫే రేసర్ల నుంచి స్క్రాంబర్ల వరకు అలనాటి క్రూజర్ల నుంచి నేటి సూపర్‌బైక్‌ల వరకు వివిద రకాల బైక్‌లతో సందడి చేయనున్నారు. మొదటి ఎడిషన్ ఇండియా బైక్ వీక్ కార్యక్రమానికి సుమారు 3,000 లకు పైగా బైక్‌లతో 6,547 మంది మోటారిస్టులు పాల్గొన్నారు. రెండవ ఎడిషన్‌లో 8000 మందికి పైగా బైకర్లు ఇందులో పాల్గొన్నారు.

Bikini Bike Wash

ఈ కార్యక్రమంలో బైకర్ల బృందం తమ బైక్‌లతో చేసే విన్యాసాలు చూపరులను ఆకట్టుకుంది. గడచిన సంవత్సరం నిర్వహించిన ఇండియా బైక్ వీక్ 2012 ఎడిషన్‌లో అంతర్జాతీయ స్టంట్ స్పెషలిస్ట్ మాటీ గ్రిఫ్ఫిన్ కూడా పాల్గొన్నారు. ఈ ఏడాది కూడా పలు స్టంట్ స్పెషలిస్టులు ఈ కార్యక్రమానికి విచ్చేసి, ఆహుతులను అలరిస్తున్నారు.

Bikini Bike Wash

ఈ కార్యక్రమానికి మరొక ప్రత్యేకత ఏంటంటే, ఈ ఈవెంట్‌కు విచ్చేసిన వీక్షకులకు ఇందులో అనేక అరుదైన కస్టమ్, ఎగ్జోటిక్ బైక్‌లను చూసే అవకాశం దక్కింది.

Bikini Bike Wash

రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో కొత్త బైక్‌లు, ఉత్పత్తులు, యాక్ససరీలను కూడా విడుదల చేశారు. బైక్ ప్రియుల కోసం ప్రత్యేక మార్కెట్‌ను కూడా ఏర్పాటు చేశారు.

More from DriveSpark

Article Published On: Tuesday, January 21, 2014, 16:07 [IST]
English summary
India bike week was held this year and if you missed it this year, tough luck guys. This year the festival was bigger and better than ever. The food, the drinks everything was taken to the next level. No matter what, keeping your bike clean should be your priority and there was something special in store if you wanted an exotic Bike Wash!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+