భారత్‌కు వస్తున్న సుజుకి 250సీసీ స్పోర్ట్స్ బైక్ ఇదే..!
జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ భారత మార్కెట్‌కు ఓ సరికొత్త 250సీసీ స్పోర్ట్స్ బైక్‌ను పరిచయం చేయనున్నట్లు మనం ఇదివరకటి కథనాల్లో తెలుసుకున్నాం. కాగా, తాజాగా సుజుకి మోటార్‌సైకిల్ తమ సరికొత్త 'సుజుకి జిడబ్ల్యూ250ఎస్' (Suzuki GW250S) స్పోర్ట్స్ బైక్‌ను చైనాలో జరుగుతున్న 2013 షాంగై మోటార్ షోలో కంపెనీ ఆవిష్కరించింది.
సుజుకి మోటార్‌సైకిల్ గతంలో అమెరికన్ మార్కెట్లలో విడుదల చేసిన సుజుకి జిడబ్ల్యూ250 (Suzuki GW250) బైక్‌కు సెమీ ఫెయిర్డ్ వెర్షనే ఈ సుజుకి జిడబ్ల్యూ250ఎస్ బైక్. తాజా సమాచారం ప్రకారం, రానున్న రెండు నెలల్లో (మే-జూన్) ఈ కొత్త 250సీసీ సుజుకి బైక్ ఇండియన్ మార్కెట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుజుకి జిడబ్ల్యూ250ఎస్ బైక్‌లో పవర్‌ఫుల్ 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 26 బిహెచ్‌పిల శక్తిని, 24 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ను 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ (సింగిల్ షాక్ అబ్జార్వర్), ముందు వెనుకల డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఇందులో ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.
సుజుకి జిడబ్ల్యూ250ఎస్ స్పోర్ట్స్ బైక్ ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్250ఆర్, హ్యోసంగ్ జిటి250, కవాసకి నిన్జా 250 వంటి మోడళ్లతో పోటీపడనుంది. మరి ఈ బైక్ లేటెస్ట్ ఫొటోలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

సుజుకి జిడబ్ల్యూ250ఎస్

సుజుకి జిడబ్ల్యూ250ఎస్

సుజుకి జిడబ్ల్యూ250ఎస్

సుజుకి జిడబ్ల్యూ250ఎస్

సుజుకి జిడబ్ల్యూ250ఎస్

సుజుకి జిడబ్ల్యూ250ఎస్

సుజుకి జిడబ్ల్యూ250ఎస్

సుజుకి జిడబ్ల్యూ250ఎస్

సుజుకి జిడబ్ల్యూ250ఎస్



Click it and Unblock the Notifications








