ఇండియన్ డార్క్ హార్స్ రూ.22 లక్షలు

By Ravi

అమెరికాకు చెందిన మోటార్‌సైకిల్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌సైకిల్' ఇటీవల షికాగోలో జరిగిన అంతర్జాతీయ మోటార్ షోలో, తమ సరికొత్త '2015 ఇండియన్ డార్క్ హార్స్' (2015 Indian Dark Horse) మోడల్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. ఈ మోడల్ భారత మార్కెట్లో కూడా విడుదల కానుంది.

ఇండియన్ మోటార్‌సైకిల్ ప్రస్తుతం భారత మార్కెట్లో స్కౌట్, ఛీఫ్ క్లాసిక్, ఛీఫ్ వింటేజ్, ఛీఫ్టైన్, రోడ్‌మాస్టర్ అనే ఐదు మోడళ్లను ఆఫర్ చేస్తోంది. తాజాగా వీటి సరసన ఆరవ మోడల్ డార్క్ హార్స్ వచ్చి చేరనుంది. ఈ నేపథ్యంలో, ఇండియన్ డార్క్ ధరను కంపెనీ తమ వెబ్‌సైట్ ద్వారా వెల్లడి చేసింది.

భారత మార్కెట్లో 2015 ఇండియన్ డార్క్ హార్స్ మోటార్‌సైకిల్ ధర రూ.21.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది.

Indian Dark Horse Price Announced For India Market

డిజైన్:
ఈ కొత్త 2015 ఇండియన్ డార్క్ హార్స్ మోటార్‌సైకిల్‌ను కంపెనీ విక్రయిస్తున్న 2014 ఛీఫ్ క్లాసిక్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని, ప్రత్యేకంగా పూర్తిగా బ్లాక్ కలర్‌లో తయారు చేశారు. దీని వార్ బానెట్ నుంచి రియర్ ఫెండర్ వరకూ మ్యాట్ బ్లాక్ ఫినిష్‌లో ఉంటుంది.

ఇంజన్:
ఇంజన్ పరంగా ఇండియన్ డార్క్ హార్స్‌కి, ఛీఫ్ క్లాసిక్ మోడళ్లకు ఎలాంటి వ్యత్యాసం లేదు. కానీ, దీని ధర మాత్రం ఛీఫ్ క్లాసిక్ కన్నా సుమారు 2,000 డాలర్లు అధికం. ఈ మోటార్‌సైకిల్‌లో సరికొత్త థండర్ స్ట్రోక్ 111 క్యూబిక్ ఇంచ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ 1819సీసీ ఇంజన్ 161 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, February 17, 2015, 18:06 [IST]
English summary
Indian Motorcycles has revealed the price of its new 2015 Dark Horse model for Indian Market. The Indian Chief Dark Horse, mechanically identical to the Chief Classic, but designed it in matt black finish.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+