త్వరలో భారత్‌కు రానున్న ఇండియన్ మోటార్‌సైకిల్స్
పురాతన అమెరికన్ మోటార్సైకిల్ బ్రాండ్ 'ఇండియన్' రానున్న ఏడాది లోపు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తుంది. 1901లో స్థాపించబడిన ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థను 2011లో పోలారిస్ ఇండస్ట్రీస్ తమ సొంతం చేసుకుంది. తమ బ్రాండ్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేస్తామని పోలారిస్ ఇండస్ట్రీస్ ఇండియా హెడ్ పంకజ్ దూబే వెల్లడించారు.
ఇండియన్ బ్రాండ్‌ను భారత్‌కు తీసుకురావటంపై నిర్ణయం తీసుకున్నామని, ప్రస్తుతం ఇది ఆరంభ దశలో ఉందని, ఈ బ్రాండ్ పూర్తిగా ఇండియాకు రావటానికి మరొక ఏడాది సమయం పట్టే ఆస్కారం ఉందని ఆయన అన్నారు. అయితే, ఏయే మోడళ్లను ఇండియాకు తీసుకువస్తారన్న విషయంపై పంకజ్ దూబే స్పందిస్తూ, వాటిని ఇంకా నిర్ణయించలేదని అన్నారు.
గడచిన శతాబ్ధ కాలంలో ఇండియన్ మోటార్‌సైకిల్ ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రాచుర్యమైన ఇండియన్ ఛీఫ్, స్కౌట్ వంటి మోటార్‌సైకిళ్లను పరిచయం చేసింది. ఇండియన్ స్కౌట్ మోటార్‌సైకిల్ ఆంథోనీ హాప్‌కిన్స్ నటించిన ప్రముఖ హాలీవుడ్ చిత్రం ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఇండియన్‌లో దర్శనమిస్తుంది. ఇటీవలే భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన పోలారిస్ ఇండస్ట్రీస్ లీజర్, ఆఫ్-రోడింగ్ వాహనాల తయారీలో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంది.
పోలారిస్ చేతిలో ఇప్పటికే ప్రముఖ అమెరికన్ మోటార్సైకిల్ బ్రాండ్ విక్టరీ కూడా ఉన్న సంగతి తెలిసినదే. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం విక్టరీ మోటార్‌సైకిళ్లు కూడా భారత్‌కు రానున్నాయి. ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ఈ ఏడాది సరికొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఈ బ్రాండ్ ఇప్పటికే 2014 ఇండియన్ ఛీఫ్ మోటార్‌సైకిల్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ బ్రాండ్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

ఇండియన్ మోటార్‌సైకిల్స్
పురాతన అమెరికన్ మోటార్సైకిల్ బ్రాండ్ 'ఇండియన్' రానున్న ఏడాది లోపు భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తుంది.

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ క్లాసిక్

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ క్లాసిక్

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ వింటేజ్

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ వింటేజ్

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ డార్క్ హార్స్

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ డార్క్ హార్స్

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ డార్క్ హార్స్

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ వింటేజ్

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ వింటేజ్

ఇండియన్ మోటార్‌సైకిల్స్
2013 ఇండియన్ ఛీఫ్ వింటేజ్



Click it and Unblock the Notifications








