భారత్‌లో 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' విడుదల; ధరలు
అమెరికాకు చెందిన పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' (Indian Motorcycles) ఈ ఏడాది జనవరి నెలలో భారత మార్కెట్లో విడుదల కానున్నట్లు గడచిన డిసెంబర్ నెలలో తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఓ కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే.
కాగా.. కంపెనీ ఇప్పుడు మూడు ఉత్పత్తులను నేడు (జనవరి 22, 2014) దేశీయ విపణిలో విడుదల చేసింది. ఇండియన్ మోటార్‌సైకిల్స్ ఇటీవలే సరికొత్త ఇంజన్‌తో పాటుగా ఈ మూడు కొత్త ఉత్పత్తులను అమెరికాలో విడుదల చేసింది. తాజాగా, వీటిని ఇండియాకు తీసుకొచ్చింది.
ఒకప్పుడు ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మోటార్‌సైకిల్ కంపెనీ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్'ను ప్రస్తుతం ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఏటివి (ఆల్ టెర్రైన్ వెహికల్) తయారీదారైన, అమెరికాకు చెందిన పోలారిస్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకొంది. భారత మార్కెట్లో ఇండియన్ మోటార్‌సైకిల్స్ ఆఫర్ చేస్తున్న ఉత్పత్తుల వివరాలు, వాటి ధరలు మరియు ఫీచర్లను తెలుసుకుందాం రండి.

ఇండియన్ మోటార్‌సైకిల్స్ అమెరికాలో విడుదల చేసిన మూడు ఉత్పత్తులను (ఇండియన్ ఛీఫ్ క్లాసిక్, ఇండియన్ ఛీఫ్ వింటేజ్, ఇండియన్ ఛీఫ్టైన్) కంపెనీ భారత్‌లో విడుదల చేసింది. వీటి ధరలు ఇలా ఉన్నాయి:
* ఇండియన్ ఛీఫ్ క్లాసిక్ - రూ.26.5 లక్షలు
* ఇండియన్ ఛీఫ్ వింటేజ్ - రూ.29.5 లక్షలు
* ఇండియన్ ఛీఫ్టైన్ - రూ.33.0 లక్షలు

వాస్తవానికి ఈ మూడు మోటార్‌సైకిళ్లు ఒకే మాదిరిగా ఉంటాయి. కాకపోతే, వీటి పేరును బట్టి ఇందులో ఆఫర్ చేసే ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. ఫలితంగా వీటి ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి.

ఈ మూడు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. అదే సరికొత్త థండర్ స్ట్రోక్ 111 ఇంజన్. ఈ 1819సీసీ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 161 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఛీఫ్ క్లాసిక్
ఇండియన్ అందించే ఎంట్రీ లెవల్ మోడల్ ఛీఫ్ క్లాసిక్ కూడా ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇందులో ఏబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, ప్రీమియం లెథర్ సీట్స్, కీలెస్ స్టార్ట్ వంటివి స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తాయి. దీని ధర రూ.26.5 లక్షలు.

ఛీప్ వింటేజ్
సాఫ్ట్ లెథర్ బ్యాగ్స్‌తో లభించే ఛీప్ వింటేజ్ రూ.29.5 లక్షలు.

ఛీఫ్టైన్
ఇకపోతే క్విక్ రిలీజ్ హార్డ్ లగేజ్ కేస్, బ్లూటూత్ ఆడియో సిస్టమ్ వంటి ఫీచర్లతో లభించే ఇండియన్ ఛీఫ్టైన్ ధర రూ.33.0 లక్షలు.

ఇండియన్ మోటార్‌సైకిల్ సంస్థ 1901లో స్థాపించారు. కాగా.. 2011లో దీనిని అమెరికాకు చెందిన పోలారిస్ ఇండస్ట్రీస్ తమ కైవశం చేసుకుంది.

గడచిన శతాబ్ధ కాలంలో ఇండియన్ మోటార్‌సైకిల్ ప్రపంచంలో కెల్లా అత్యంత ప్రాచుర్యమైన ఇండియన్ ఛీఫ్, స్కౌట్ వంటి మోటార్‌సైకిళ్లను పరిచయం చేసింది. ఇండియన్ స్కౌట్ మోటార్‌సైకిల్ ఆంథోనీ హాప్‌కిన్స్ నటించిన ప్రముఖ హాలీవుడ్ చిత్రం ది వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఇండియన్‌లో దర్శనమిస్తుంది.

పోలారిస్ చేతిలో ఇప్పటికే ప్రముఖ అమెరికన్ మోటార్‍సైకిల్ బ్రాండ్ విక్టరీ కూడా ఉన్న సంగతి తెలిసినదే. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం విక్టరీ మోటార్‌సైకిళ్లు కూడా భారత్‌కు రానున్నాయి.


Click it and Unblock the Notifications








