బైక్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పోలారిస్ 'ఇండియన్ స్కౌట్' బైక్

By Ravi

రిహిత్ స్పోర్ట్స్ మరియు ఈవెంట్ క్యాపిటల్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న 2014వ ఎడిషన్ 'బైక్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' (బిఎఫ్ఐ) అక్టోబర్ 4వ తేదీన బుధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ వద్ద ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పోలారిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఇటీవలే ఇండియన్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌లో ఆవిష్కరించిన సరికొత్త 'ఇండియన్ స్కౌట్' (Indian Scout)ను ప్రదర్శనకు ఉంచింది.

పోలారిస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ దూబే ఈ బైక్‌ని ఆవిష్కరించారు. ఇండియన్ స్కౌట్ లగ్జరీ బైక్ కోసం కంపెనీ ఆగస్ట్ 27, 2014 నుంచే బుకింగ్‌లను స్వీకరిస్తోంది. ఈ క్రూజర్ స్టయిల్ బైక్‌లో మొట్టమొదటి సారిగా లిక్విడ్-కూల్డ్ ఇండియన్ మోటార్‌సైకిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇదొక సమర్థవంతమైన మరియు విశ్వసనీయమైన 69 క్యూబిక్ ఇంచ్ వి-ట్విన్ ఇంజన్, ఇది గరిష్టంగా 100 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

Indian Scout

క్లాసిక్ లుక్, మోడ్రన్ టెక్‌తో తయారు చేసిన ఈ కొత్త మోడల్ లెజండ్రీ ఇండియన్ స్కౌట్ పేరును అథెంటిక్ ఇండియన్ మోటార్‌సైకిల్ స్టైల్‌లో కలిగి ఉంటుంది. ఇందులోని హై-పెర్ఫార్మెన్స్ 1131సీసీ, వి-ట్విన్ ఇంజన్ మరో ప్రత్యేక ఆకర్షణ. క్లాసిక్ రిగిడ్ ట్రయాంగిల్ డిజైన్, ప్రీమియం మోనోట్యూబ్ రియర్ షాక్స్ మంచి హ్యాండ్లింగ్, కంఫర్ట్‌ను ఆఫర్ చేస్తాయి. దీని బరువు 244 కేజీల నుంచి 253 కేజీల వరకు ఉంటుంది.

భారత మార్కెట్లో ఈ కొత్త ఇండియన్ స్కౌట్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Most Read Articles

English summary
Polaris India Pvt. Ltd., a wholly-owned subsidiary of Polaris Industries, showcased the newly launched motorcycle, the Indian Scout for the first time in India during the Bike Festival of India.
Story first published: Monday, October 6, 2014, 12:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X