భారత్‌లో తొలి 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' డీలర్‌షిప్
అమెరికాకు చెందిన పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్ 'ఇండియన్ మోటార్‌సైకిల్స్' (Indian Motorcycles) గడచిన జనవరి నెలలో భారత మార్కెట్లో తమ మూడు ఉత్పత్తులను (ఇండియన్ ఛీఫ్ క్లాసిక్, ఇండియన్ ఛీఫ్ వింటేజ్, ఇండియన్ ఛీఫ్టైన్) విడుదల చేసిన సంగతి తెలిసినదే.
ఇండియన్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో తమ ఉత్పత్తులనైతే విడుదల చేసింది కానీ, ఆ కంపనీకి ఇక్కడి మార్కెట్లో ఎలాంటి అఫీషియల్ డీలర్‌షిప్ లేదు. ఈ నేపథ్యంలో, ఇండియన్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో తమ తొలి డీలర్‌షిప్‌ను హర్యానాలో గుర్గావ్‌లో మే 7, 2014వ తేదీన ప్రారంభించనుంది. ఈ డీలర్‌షిప్‌ను గుర్గావ్‌లోని బి-10, ఇన్ఫోసిటీ, సెక్టార్-34 వద్ద ఏర్పాటు చేయనున్నారు.

భారత మార్కెట్లో ఇండియన్ మోటార్‌సైకిల్స్ అందిస్తున్న మూడు ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి:
* ఇండియన్ ఛీఫ్ క్లాసిక్ - రూ.26.5 లక్షలు
* ఇండియన్ ఛీఫ్ వింటేజ్ - రూ.29.5 లక్షలు
* ఇండియన్ ఛీఫ్టైన్ - రూ.33.0 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

వాస్తవానికి ఈ మూడు మోటార్‌సైకిళ్లు ఒకే మాదిరిగా ఉంటాయి. కాకపోతే, వీటి పేరును బట్టి ఇందులో ఆఫర్ చేసే ఫీచర్లు వేర్వేరుగా ఉంటాయి. ఫలితంగా వీటి ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఈ మూడు మోడళ్లలో ఒకేరకమైన ఇంజన్‌ను ఉపయోగించారు. అదే సరికొత్త థండర్ స్ట్రోక్ 111 ఇంజన్. ఈ 1819సీసీ ఇంజన్ గరిష్టంగా 110 పిఎస్‌ల శక్తిని, 161 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








