హ్యార్లీ, బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ల కన్నా జపనీస్ బైక్‌లే మేలు
హ్యార్లీ డేవిడ్‌సన్, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ బైక్‌ల కన్నా జపనీస్ బైక్‌లో ఎక్కువ విశ్వసనీయమైనవని ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన 'కన్జ్యూమర్ రిపోర్ట్స్' అనే మాస పత్రిక నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్‌సన్, జర్మనీకు చెందిన బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లను ఉపయోగిస్తున్న యజమానులు, వారి బైక్‌ల విషయంలో ఎదుర్కునే సమస్యలతో పోల్చుకుంటే, జపనీస్ మోటార్‌సైకిళ్లు ఉపయోగించే యజమానులు తమ వాహనలతో తక్కువ సమస్యలు ఎదుర్కుంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.
కన్జ్యూమర్ రిపోర్ట్స్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ద్వారా నిర్వహించబడిన మొట్టమొదటి మోటార్‌సైకిల్ విశ్వసనీయ సర్వేలో నలుగురు హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను ఉపయోగించే యజమానులలో ఒకరు తమ బైక్‌తో సాంకేతిక సమస్యలను ఎదుర్కుంటుంగా, ముగ్గురు బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లను ఉపయోగించే యజమానులలో ఒకరు తమ బైక్‌తో సాంకేతిక సమస్యలను ఎదుర్కుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది.
జపనీస్ బ్రాండ్‌లైన హోండా, యమహా కవాసకి మోటార్‌సైకిళ్లను ఉపయోగించే యజమానులలో పది మందిలో ఒకరు మాత్రమే తమ బైక్‌లతో సమస్యలను ఎదుర్కుంటున్నట్లు ఈ సర్వే పేర్కొంటుంది. అయితే, బిఎమ్‌డబ్ల్యూ, హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ల యజమానులు మాత్రం పటిష్టమైన బ్రాండ్ విశ్వసనీయతను కలిగి ఉన్నారు. తమ బైక్‌లతో సమస్యలు వచ్చినప్పటికీ సదరు బ్రాండ్‌లను మాత్రం వదిలిపెట్టమని వీరు చెబుతున్నారు. బిఎమ్‌డబ్ల్యూ 74 శాతం, హ్యార్లీ డేవిడ్‌సన్ 75 శాతం బ్రాండ్ లాయల్టీని సంపాధించుకుంది.
హోండా ఓనర్లు కూడా ఇదే తరహా బ్రాండ్ లాయల్టీని కనబరచారు. ఈ బ్రాండ్ 72 శాతం బ్రాండ్ లాయల్టీని సంపాధించుకోగా, యమహా 63 శాతం, కవాసకి 60 శాతం బ్రాండ్ లాయల్టీని సంపాధించుకున్నాయి. మొత్తమ్మీద చూసుకుంటే, ఇతర బైక్‌లతో పోల్చుకుంటే జపనీస్ బైక్‌లలో సాంకేతిక సమస్యలు తక్కువగా తలెత్తున్నట్లు తెలుస్తోంది.

హ్యార్లీ, బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ల కన్నా జపనీస్ బైక్‌లే మేలు
హ్యార్లీ డేవిడ్‌సన్, బిఎమ్‌డబ్ల్యూ వంటి లగ్జరీ బైక్‌ల కన్నా జపనీస్ బైక్‌లో ఎక్కువ విశ్వసనీయమైనవని ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాకు చెందిన 'కన్జ్యూమర్ రిపోర్ట్స్' అనే మాస పత్రిక నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

హ్యార్లీ, బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ల కన్నా జపనీస్ బైక్‌లే మేలు
అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్‌సన్, జర్మనీకు చెందిన బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లను ఉపయోగిస్తున్న యజమానులు, వారి బైక్‌ల విషయంలో ఎదుర్కునే సమస్యలతో పోల్చుకుంటే, జపనీస్ మోటార్‌సైకిళ్లు ఉపయోగించే యజమానులు తమ వాహనలతో తక్కువ సమస్యలు ఎదుర్కుంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది.

హ్యార్లీ, బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ల కన్నా జపనీస్ బైక్‌లే మేలు
కన్జ్యూమర్ రిపోర్ట్స్ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ద్వారా నిర్వహించబడిన మొట్టమొదటి మోటార్‌సైకిల్ విశ్వసనీయ సర్వేలో నలుగురు హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌లను ఉపయోగించే యజమానులలో ఒకరు తమ బైక్‌తో సాంకేతిక సమస్యలను ఎదుర్కుంటుంగా, ముగ్గురు బిఎమ్‌డబ్ల్యూ బైక్‌లను ఉపయోగించే యజమానులలో ఒకరు తమ బైక్‌తో సాంకేతిక సమస్యలను ఎదుర్కుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది.

హ్యార్లీ, బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ల కన్నా జపనీస్ బైక్‌లే మేలు
జపనీస్ బ్రాండ్‌లైన హోండా, యమహా కవాసకి మోటార్‌సైకిళ్లను ఉపయోగించే యజమానులలో పది మందిలో ఒకరు మాత్రమే తమ బైక్‌లతో సమస్యలను ఎదుర్కుంటున్నట్లు ఈ సర్వే పేర్కొంటుంది.

హ్యార్లీ, బిఎమ్‌డబ్ల్యూ బైక్‌ల కన్నా జపనీస్ బైక్‌లే మేలు
బిఎమ్‌డబ్ల్యూ, హ్యార్లీ డేవిడ్‌సన్ బైక్‌ల యజమానులు మాత్రం పటిష్టమైన బ్రాండ్ విశ్వసనీయతను కలిగి ఉన్నారు. తమ బైక్‌లతో సమస్యలు వచ్చినప్పటికీ సదరు బ్రాండ్‌లను మాత్రం వదిలిపెట్టమని వీరు చెబుతున్నారు. బిఎమ్‌డబ్ల్యూ 74 శాతం, హ్యార్లీ డేవిడ్‌సన్ 75 శాతం బ్రాండ్ లాయల్టీని సంపాధించుకుంది. హోండా ఓనర్లు కూడా ఇదే తరహా బ్రాండ్ లాయల్టీని కనబరచారు. ఈ బ్రాండ్ 72 శాతం బ్రాండ్ లాయల్టీని సంపాధించుకోగా, యమహా 63 శాతం, కవాసకి 60 శాతం బ్రాండ్ లాయల్టీని సంపాధించుకున్నాయి.

Click it and Unblock the Notifications