కవాసకి నిన్జా జెడ్ఎక్స్-10ఆర్ వార్షికోత్సవ ఎడిషన్ బైక్ విడుదల
జపనీస్ టూవీలర్ బ్రాండ్, కవాసకి భారత మార్కెట్లో విక్రయిస్తున్న 'నిన్జా జెడ్ఎక్స్-10' సూపర్‌బైక్‌లో కంపెనీ వార్షికోత్సవ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. కవాసకి 30వ వార్షికోత్సవం ఎడిషన్‌గా వచ్చిన ఈ కొత్త నిన్జా జెడ్ఎక్స్-10 సూపర్‌బైక్ రెండు ప్రత్యేక రంగులలో లభిస్తుంది. అవి - 1. లైమ్ గ్రీన్, 2. స్టార్‌డస్ట్ వైట్.
కవాసకి నిన్జా జెడ్ఎక్స్-10ఆర్ (Kawasaki Ninja ZX-10R) బైక్‌ను కంపెనీ సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకి దిగుమతి చేసుకొని విక్రయిస్తోంది. దేశీయ విపణిలో రెగ్యులర్ జెడ్ఎక్స్-10ఆర్ బైక్ ధర రూ.15.70 లక్షలుగా ఉంటే, ఈ స్పెషల్ ఎడిషన్ జెడ్ఎక్స్-10ఆర్ బైక్ ధర రూ.15.90 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)గా ఉంది.

కవాసకి అందిస్తున్న ఈ వార్షికోత్సవ ఎడిషన్ నిన్జా జెడ్ఎక్స్-10ఆర్ బైక్‌లో ఓహ్లిన్స్-కవాసకి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ డ్యాంపర్, ట్రాక్షన్ కంట్రోల్, ఇంటెలిజెంట్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తున్నారు. అలాగే, దీనిని స్పెషల్ ఎడిషన్‌గా సూచించేందుకు దీనిపై '30' బ్యాడ్జ్‌ని అంటించారు.
ఇంజన్ పరంగా ఈ కొత్త వార్షికోత్సవ ఎడిషన్ కవాసకి నిన్జా జెడ్ఎక్స్-10ఆర్ బైక్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 998సీసీ, ఇన్-లైన్ 4-సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 197 హార్స్‌పవర్‌ల శక్తిని, 112 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








