కవాసకి జెడ్250, ఈఆర్-6ఎన్ మోటార్‌సైకిళ్ల విడుదల

By Ravi

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటోతో చేతులు కలిపి భారత మార్కెట్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రముఖ జపనీస్ లగ్జరీ బైక్ మేకర్ కవాసకి, నేడు (అక్టోబర్ 17, 2014) కవాసకి జెడ్250, కవాసకి ఈఆర్-6ఎన్ అనే రెండు సరికొత్త మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

* కవాసకి జెడ్250 - రూ.2.99 లక్షలు
* కవాసకి ఈఆర్-6ఎన్ - రూ.4.78 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Kawasaki Z250 Green

కవాసకి జెడ్250 బైక్‌లో చడటానికి అచ్చం జెడ్800 బైక్ మాదిరిగానే అనిపిస్తుంది. ఇందులో 249సీసీ, ఫ్యూయెల్ ఇంజక్టెడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 33 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన మైలేజ్ కోసం ఇందులో డ్యూయెల్ థ్రోటల్ వాల్వ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రంట్ అండ్ రియర్ సింగిల్ డిస్క్ బ్రేక్, మోనోషాక్ సస్పెన్షన్, 17 ఇంచ్ టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 110/70 సెక్షన్ టైర్స్ మరియు వెనుక వైపు 140/70 సెక్షన్స్ టైర్లను కవాసకి జెడ్250లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఈ సెగ్మెంట్లో హోండా, కెటిఎమ్, హ్యోసంగ్ అందిస్తున్న మోటార్‌సైకిళ్లతో పోటీ పడనుంది.


ఇక కవాసకి ఈఆర్-6ఎన్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే.. ఇది నిన్జా 650 బైక్‌కు నేక్డ్ వేరియంట్. కవాసకి నిన్జా 650 స్పోర్ట్స్ బైక్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే ఈఆర్-6ఎన్ బైక్‌లోను ఉపయోగిస్తున్నారు. ఇందులోని పారలల్ ట్విన్-సిలిండర్, 649సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ అండ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 71.1 బిహెచ్‌పిల శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 6.5 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను ఆఫర్ చేయటం లేదు. బహుశా భవిష్యత్తులో ఆఫర్ చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Thursday, October 16, 2014, 17:32 [IST]
English summary
Kawasaki, one of the biggest Japanese motorcycle manufacturers, has launched two new motorcycles today, the much awaited Z250 and the ER-6n.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+