కవాసకి నుంచి జెడ్250, ఈఆర్-6ఎన్ మోటార్‌సైకిళ్లు
జపనీస్ లగ్జరీ బైక్ మేకర్ కవాసకి, భారత మార్కెట్లో ప్రోడక్ట్ తమ పోర్ట్‌ఫోలియోని మరింత విస్తరించుకునే దిశగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే, కవాసకి మరికొద్ది రోజుల్లో రెండు సరికొత్త మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది.
కవాసకి ఇదివరకే మార్కెట్లో విడుదల చేసిన జెడ్800 నేక్డ్ స్పోర్ట్స్ బైక్ నుంచి స్ఫూర్తి పొంది అదే సిరీస్‌లో తయారు చేసిన కవాసకి జెడ్250 అనే 250సీసీ మోటార్‌సైకిల్‌ను అలాగే, కవాసకి ఈఆర్-6ఎన్ అనే 650సీసీ మోటార్‌సైకిల్‌ను కూడా కంపెనీ విడుదల చేయనుంది.

కవాసకి జెడ్250 బైక్‌లో చడటానికి అచ్చం జెడ్800 బైక్ మాదిరిగానే అనిపిస్తుంది. ఇందులో 249సీసీ, ఫ్యూయెల్ ఇంజక్టెడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 33 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన మైలేజ్ కోసం ఇందులో డ్యూయెల్ థ్రోటల్ వాల్వ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రంట్ అండ్ రియర్ సింగిల్ డిస్క్ బ్రేక్, మోనోషాక్ సస్పెన్షన్, 17 ఇంచ్ టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 110/70 సెక్షన్ టైర్స్ మరియు వెనుక వైపు 140/70 సెక్షన్స్ టైర్లను కవాసకి జెడ్250లో ఆఫర్ చేస్తున్నారు.

ఇక కవాసకి ఈఆర్-6ఎన్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే.. ఇది నిన్జా 650 బైక్‌కు నేక్డ్ వేరియంట్‌గా అనిపిస్తుంది. కవాసకి నిన్జా 650 స్పోర్ట్స్ బైక్‌లో ఉపయోగిస్తున్న ఇంజన్‌నే ఈఆర్-6ఎన్ బైక్‌లోను ఉపయోగిస్తున్నారు. ఇందులోని పారలల్ ట్విన్-సిలిండర్, 649సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ అండ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్ గరిష్టంగా 8500 ఆర్‌పిఎమ్ వద్ద 71.1 బిహెచ్‌పిల శక్తిని మరియు 7000 ఆర్‌పిఎమ్ వద్ద 6.5 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
అక్టోబర్ 16, 2014వ తేదీన ఈ రెండు మోటార్‌సైకిళ్లు మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్


Click it and Unblock the Notifications








