కవాసకి వెర్సెస్ 1000 బైక్ విడుదల; ధర రూ.12.90 లక్షలు
జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం కవాసకి మోటార్స్ భారత మార్కెట్లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. కవాసకి అందిస్తున్న అతిపెద్ద అడ్వెంచర్ టూరింగ్ బైక్ 'వెర్సెస్ 1000' (Versys 1000)ను కంపెనీ భారత్‌కు పరిచయం చేసింది.
కవాసకి ఇటీవలే ఈ బైక్‌ను గ్లోబల్ మార్కెట్లో రిఫ్రెష్ చే విడుదల చేసింది. ఈ కొత్త కవాసకి వెర్సెస్ 1000 బైక్ డ్యూయెల్ హారిజాంటల్ హెడ్‌లైట్స్, వాటి మధ్యలో ఎయిర్ వెంట్ ఉంటాయి. ఇది ఈ సెగ్మెంట్లోని సుజుకి వి-స్ట్రోమ్ మోడల్‌తో పోటీ పడనుంది.
కవాసకి వెర్సెస్ 1000 మోటార్‌సైకిల్‌లో 1043సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 7500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 10.4 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

కొత్త కవాసకి వెర్సెస్‌లో డిఓహెచ్‌సి, ప్రతి సిలిండర్‌కు 4 వాల్వ్స్ ఉంటాయి. లాంగ్ స్ట్రోక్, ముందు వైపు అప్ సైడ్ డౌన్ ఫోర్క్, వెనుక వైపు లాంగ్ ట్రావెల్ మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫీచర్ల వలన వెర్సెస్ ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌ని కలిగి ఉంటుంది.
కవాసకి వెర్సెస్ 1000 బైక్ మొత్తం బరువు 249 కేజీలు. ఇందులో ట్విన్ డిస్క్ బ్రేక్స్‌తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)ను అమర్చారు. భారత మార్కెట్లో ఈ బైక్ ధరను రూ.12.90 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications








