కవాసకి నిన్జా 250ఆర్ఆర్ మోనో.. ఇండియాకు వస్తుందా?

By Ravi

జపనీస్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కవాసకి తాజాగా తమ నిన్జా సిరీస్‌లో మరో సరికొత్త వేరియంట్‌ను పరిచయం చేసింది. 'నిన్జా 250ఆర్ఆర్ మోనో' (Ninja 250RR Mono) పేరిట కంపెనీ కొత్త 250సీసీ వెర్షన్ బైక్‌ను ఇండోనేషియాలో ఆవిష్కరించింది.

ఈ బైక్‍‌లో 250సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను మాత్రమే ఉపయోగించారు. అందుకే, ఈ బైక్‌కు నిన్జా 250ఆర్ఆర్ మోనో అనే పేరు పెట్టారు (మోనో అంటే సింగిల్ అని అర్థం). సరసమైన ధరకే 250సీసీ స్పోర్ట్స్ బైక్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో కవాసకి ఈ వేరియంట్‌ను పరిచయం చేసినట్లు తెలుస్తోంది.


కవాసకి నిన్జా 250ఆర్ఆర్ మోనో మోటార్‌సైకిల్‌లో 250సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 27.61 బిహెచ్‌పిల శక్తిని, 22.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది (ఇదంతా సింగిల్ సిలిండర్ నుంచే). ఇది డిఓహెచ్‌సి కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉండి, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ టెక్నాలజీతో లభిస్తుంది.

ఈ బైక్ గరిష్టంగా గంటకు 153 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని కవాసకి పేర్కొంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇందులో ముందువైపు 110/80 R-17 టైరును, వెనుక వైపు 130/70 R-17 టైరును అమర్చారు.

Kawasaki Ninja 250 RR Mono Single Cylinder

ఈ బైక్‌‌ను కొత్త ట్యూబ్ టైప్ డైమండ్ ఫ్రేమ్‌పై తయారు చేశారు. ఇది ఇతర నిన్జా బైక్‌ల మాదిరిగానే ఫుల్లీ ఫెయిర్డ్ బైక్. ఇందులో ముందు వైపు 263 మి.మీ. డిస్క్ బ్రేక్‌ను, వెనుక వైపు 193 మి.మీ. డిస్క్ బ్రేక్‌ను ఆఫర్ చేస్తున్నారు. అయితే, ఇందులో ఏబిఎస్ ఫీచర్ గురించి కంపెనీ (కనీసం ఆప్షనల్‌గా కూడా) ఎలాంటి ప్రస్థావ తీసుకురాలేదు.

దీని మొత్తం బరువు కేవలం 151 కేజీలు మాత్రమే. ఇండోనేషియాలో వచ్చే నెల నుంచి ఈ మోడల్ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. త్వరలోనే ఇది ఇండియన్ మార్కెట్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. దేశీయ విపణిలో కవాసకి నిన్జా 250ఆర్ఆర్ మోనో బైక్ ధర సుమారు రూ.2 లక్షలకు దిగువనే ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Monday, February 17, 2014, 17:56 [IST]
English summary
Kawasaki and Ninja so far have always been classified in the expensive segment however, costs are justified in the package being offered. The Japanese manufacturer has unveiled it's new Ninja 250RR mono in Indonesia. The bikes speciality is that it will sport a 250cc engine however, it will utilise only a single cylinder. Hence, the name Mono.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+