ఏప్రిల్ 10, 2013న విడుదల కానున్న కవాసకి నిన్జా 300

By Ravi

జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి, భారత మార్కెట్లో అందిస్తున్న నిన్జా సిరీస్ స్పోర్ట్స్ బైక్‌లలో మరొక సరికొత్త వేరియంట్‌ను విడుదల చేయనుంది. భారత ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటోతో చేతులు కలిపి, ఇక్కడి మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కవాసకి, వచ్చే నెల 10వ తేదీన తమ కొత్త 'నిన్జా 300' (Ninja 300) స్పోర్ట్స్ బైక్‌ను దేశీయ విపణిలో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం కవాసకి భారత మార్కెట్లో అందిస్తున్న 250సీసీ వేరియంట్ నిన్జా 250 స్పోర్ట్స్ బైక్ స్థానాన్ని ఇది భర్తీ చేయనుంది.

కవాసకి నిన్జా 250తో పోల్చుకుంటే కవాసకి నిన్జా 300 సరికొత్త స్టయిలింగ్‌ను కలిగి ఉంటుంది. కవాసకి జెడ్ఎక్స్-10ఆర్ మోడల్‌ నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన హెడ్‌ల్యాంప్స్, ఫ్లోటింగ్ విజర్, రివైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్, లార్జర్ ఫెయిరింగ్ వెంట్స్ వంటి డిజైన్ మార్పులను ఇందులో గమనించవచ్చు. ఈ బైక్‌లోని రేడియేటర్ ఫ్యాన్ కౌల్ వేడిని రైడర్‌కు తగలకుండా చేస్తుంది.

ఈ సరికొత్త కవాసకి నిన్జా 300 స్పోర్ట్స్ బైక్‌లో 296సీసీ, పారలల్ ట్విన్-సిలిండర్, ఫ్యూయెల్ ఇంజక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 38.8 బిహెచ్‌పిల శక్తిని మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 27.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, 37 మి.మీ. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, లింక్డ్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్, ముందు వైపు 290 మి.మీ., వెనుక వైపు 220 మి.మీ. నిస్సిన్ డిస్క్ బ్రేక్స్ ఇందులో చెప్పుకోదగిన ప్రత్యేకతలు.

బజాజ్-కవాసకి ఈ బైక్ ధరను ఇంకా వెల్లడించపోయినప్పటికీ, ఇది రూ.2.5 లక్షలకు దిగువన ఉండొచ్చని తెలుస్తోంది. ఇది ఈ సెగ్మెంట్లోని హోండా సిబిఆర్250ఆర్, హ్యోసంగ్ జిటి250ఆర్ వంటి మోడళ్లతో పోటీపడనుంది. కవాసకి నిన్జా 300 స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించి మరిన్ని వివరాలను కంపెనీ ఏప్రిల్ 10న వెల్లడించనుంది. ఈ బైక్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

కవాసకి నిన్జా 300

More from DriveSpark

Article Published On: Friday, March 29, 2013, 15:09 [IST]
English summary
Kawasaki's next iteration of the quarter liter bike, the Ninja 300 will reportedly arrive as soon as April 10 or in a fortnight's time, according to Autocar India. The Ninja 300, which will replace the Ninja 250R was announced in September last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+