కవాసకి నిన్జా 300 బైక్ విడుదల; ధర రూ.3.5 లక్షలు
స్పోర్ట్స్ బైక్ ప్రియులను ఎంతగానో ఊరిస్తూ వచ్చిన 'కవాసకి నిన్జా 300' నేడు భారత మార్కెట్లో విడుదలయ్యింది. దేశీయ ఆటో దిగ్గజం బజాజ్ ఆటో రూ.3.5 లక్షల ధరకే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఈ బైక్‌ను అందిస్తోంది. పూనేలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఈ కొత్త కవాసకి నిన్జా 300 బైక్‌ను విడుదల చేశారు.
కవాసకి నిన్జా 300 స్పోర్ట్స్ బైక్‌లో 296సీసీ, పారలల్ ట్విన్-సిలిండర్, ఫ్యూయెల్ ఇంజక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 11,000 ఆర్‌పిఎమ్ వద్ద 38.8 బిహెచ్‌పిల శక్తిని మరియు 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 27.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో (1-క్రిందకు, 5-పైకి) జతచేయబడి ఉంటుంది. ఇందులో ఏబిఎస్ ఆప్షన్‌ను కంపెనీ అందించడం లేదు.
ఈ బైక్ మొత్తం బరువు 172 కేజీలు. ఇది లైమ్ గ్రీన్, పెరల్ స్టార్‌డస్ట్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, 37 మి.మీ. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, లింక్డ్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్, ముందు వైపు 290 మి.మీ., వెనుక వైపు 220 మి.మీ. నిస్సిన్ డిస్క్ బ్రేక్స్ ఇందులో చెప్పుకోదగిన ప్రత్యేకతలు.



Click it and Unblock the Notifications








