కవాసకి నిన్జా జెడ్ఎక్స్-14ఆర్ ఇప్పుడు పెరల్ వైట్ కలర్‌లో లభ్యం
జపనీస్ బైక్ మేకర్ కవాసకి గడచిన సంవత్సరం జులై నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన కవాసకి నిన్జా జెడ్ఎక్స్-14ఆర్ బైక్‌లో కంపెనీ ఓ కొత్త కలర్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకూ లైమ్ గ్రీన్ పెయింట్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తున్న నిన్జా జెడ్ఎక్స్-14ఆర్ ఇకపై పెరల్ వైట్ మెటాలిక్ పెయింట్ ఆప్షన్‌లో కూడా లభ్యం కానుంది.
అయితే, పెరల్ వైట్ మెటాలిక్ కలర్ కవాసకి నిన్జా జెడ్ఎక్స్-14ఆర్ కావాలనుకుంటే కస్టమర్లు అదనంగా రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కవాసకి తమ లైమ్ గ్రీన్ కలర్ నిన్జా జెడ్ఎక్స్-14ఆర్ బైక్‌ని రూ.17.66 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై)కి విక్రయిస్తోంది.

కవాసకి నిన్జా జెడ్ఎక్స్-14ఆర్ బైక్‌లో 1441సీసీ, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 197 హెచ్‌పిల శక్తిని, 162.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ర్యామ్ ఎయిర్ ఇండక్షన్ సిస్టమ్ కారణంగా ఇది అదనంగా 207 హార్స్‌పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.
ఈ బైక్‌లోని ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. పూర్తిగా అల్యూమినియం మెటీరియల్‌ని ఉపయోగించి దీని మోనోకాక్ షాషీని డెవలప్ చేశారు. ఇందులో 22 లీటర్ల ఫ్యూయెల్ ఉంటుంది. దీని మొత్తం బరువు 268 కిలోలు.


Click it and Unblock the Notifications








