ఏబిఎస్, స్లిప్పర్ క్లచ్‌తో రానున్న కొత్త కవాసకి జెడ్250

By Ravi

ప్రముఖ జపనీస్ లగ్జరీ బైక్ మేకర్ కవాసకి, ఈ ఏడాది అక్టోబర్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన కవాసకి జెడ్250 మోడల్‌లో ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కవాసకి జెడ్250 కేవలం డిస్క్ బ్రేక్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. కాగా.. ఇందులో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) మరియు స్లిప్పర్ క్లచ్‌ను స్టాండర్డ్‌గా ఆఫర్ చేయాలని కంపెనీ భావిస్తోంది.

వాస్తవానికి ఈ రెండు ఫీచర్లతో కూడిన కవాసకి జెడ్250 ఇప్పటికే జపనీస్ మార్కెట్లో లభ్యమవుతోంది. కాగా.. 2015 నుంచి దక్షణాధి ఆసియా మార్కెట్లలో కూడా ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను ప్రవేశపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం మార్కట్లో లభిస్తున్న నాన్-ఏబిఎస్ వెర్షన్ కవాసకి జెడ్250 ధర రూ.2.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

Kawasaki Z250

కవాసకి జెడ్250 బైక్‌లో చడటానికి అచ్చం జెడ్800 బైక్ మాదిరిగానే అనిపిస్తుంది. ఇందులో 249సీసీ, ఫ్యూయెల్ ఇంజక్టెడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 33 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన మైలేజ్ కోసం ఇందులో డ్యూయెల్ థ్రోటల్ వాల్వ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రంట్ అండ్ రియర్ సింగిల్ డిస్క్ బ్రేక్, మోనోషాక్ సస్పెన్షన్, 17 ఇంచ్ టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 110/70 సెక్షన్ టైర్స్ మరియు వెనుక వైపు 140/70 సెక్షన్స్ టైర్లను కవాసకి జెడ్250లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఈ సెగ్మెంట్లో హోండా, కెటిఎమ్, హ్యోసంగ్ అందిస్తున్న మోటార్‌సైకిళ్లతో పోటీ పడనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 30, 2014, 11:05 [IST]
English summary
Kawasaki plans to launch the upgrade Z250 with ABS and slipper clutch as a standard offering. The updated version of the bike will be launched in Southeast Asian markets from 2015 onwards.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+