డిసెంబర్ 23న కవాసకి జెడ్1000 బైక్ విడుదల

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి గడచిన నవంబర్ నెలలో జరిగిన 2013 ఈఐసిఎమ్ఏ అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షోలో ఆవిష్కరించిన '2014 కవాసకి జెడ్1000' స్పోర్ట్స్ బైక్‌ను ఇండియన్ మార్కెట్‌కు తీసుకురానున్నట్లు మేము ఇదివరకటి కథనాల్లో ప్రచురించిన సంగతి తెలిసినదే. కాగా.. తాజా అప్‌డేట్ ప్రకారం, కవాసకి ఈ సరికొత్త జెడ్1000 బైక్‌ను ఈనెల 23న దేశీయ విపణిలో వాణిజ్య పరంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం కవాసకి భారత మార్కెట్లో నిన్జా జెడ్ఎక్స్-10ఆర్, జెడ్ఎక్స్-14ఆర్, నిన్జా 300ఆర్, నిన్జా 650ఆర్ అనే నాలుగు మోడళ్లను విక్రయిస్తుంది. ఇందులో రెండు మోడళ్లు (జెడ్ఎక్స్-10ఆర్, జెడ్ఎక్స్-14ఆర్) సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లు కాగా, మిగిలిన రెండు మోడళ్లు (300ఆర్, 650ఆర్) సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలుగా దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తున్నారు.

ఇక కవాసకి నుంచి కొత్తగా రానున్న జెడ్1000 స్ట్రీట్ ఫైటర్ బైక్ విషయానికి వస్తే, ఇది డిసెంబర్ 23, 2013న భారత మార్కెట్లో విడుదల కానుంది. డెలివరీలు మాత్రం జనవరి నెలలో ప్రారంభమవుతాయని అంచనా. కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కవాసకి జెడ్1000

కవాసకి జెడ్1000 సూపర్‌బైక్‌లో కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ డిజైన్ చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. అంతేకాదు.. ఓ జపనీస్ స్పోర్ట్ బైక్‌లో ఎల్ఈడి హెడ్‌లైట్లను ఉపయోగించటం కూడా ఇదే మొదటిసారి.

కవాసకి జెడ్1000

కవాసకి జెడ్1000 బైక్‌లో శక్తివంతమైన 1043సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 హార్స్ పవర్‌ల శక్తిని, 111 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (ఇది రీట్యూన్ చేయబడిన ఇంజన్).

కవాసకి జెడ్1000

ఈ బైక్‌లో కవాసకి ఈసియూ సెట్టింగ్స్‌ను కూడా రివైజ్ చేసింది. ఇంకా కామ్‌షాఫ్ట్ టైమింగ్స్‌ను ఆల్టర్ చేయటం, కొత్త ఎయిర్‌బాక్స్ డిజైన్‌ను పరిచయం చేయటం కూడా జరిగింది.

కవాసకి జెడ్1000

బ్రేక్ మోనోబ్లాక్ కాలిపర్స్‌ను టోకికో గ్రిప్పింగ్ పెటల్ బ్రేక్ డిస్క్స్ నుంచి గ్రహించారు. మాస్టర్ సిలిండర్‌లో చేసిన ఇంప్రూవ్‌మెంట్స్ కూడా బ్రేకింగ్ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరచింది.

కవాసకి జెడ్1000

షోవా బిగ్ పిస్టన్ ఫోర్క్ నుంచి గ్రహించిన సస్పెన్షన్ కూడా మరింత సౌకర్యవంతమైన రైడ్‌ను ఆఫర్ చేస్తుంది.

కవాసకి జెడ్1000

ఫుల్ ట్యాంక్ ఇంధనంతో (17 లీటర్లు) కలిపి 2014 కవాసకి జెడ్1000 మొత్తం బరువు 221 కేజీలు.

కవాసకి జెడ్1000

కవాసకి జెడ్1000 బైక్ గోల్డెన్ బ్లేజ్డ్ గ్రీన్, మెటాలిక్ గ్రాఫైట్ గ్రే రంగులలో లభిస్తుంది.

కవాసకి జెడ్1000

కొత్త 2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్ డిజిటల్ అండ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది.

కవాసకి జెడ్1000

కొత్త 2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్ డిజిటల్ అండ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుంది.

కవాసకి జెడ్1000

కొత్త 2014 కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్‌లో ప్రొజెక్టర్ స్టైల్ ఎల్ఈడి హెడ్‍‌‌లైట్స్ ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Thursday, December 19, 2013, 17:52 [IST]
English summary
2014 Kawasaki Z1000, the naked sports bike based on the liter class Ninja will be launched in India on December 23, as announced by the Japanese two wheeler manufacturer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+