భారత్‌లో కవాసకి జెడ్1000 అనధికారిక బుకింగ్స్ ప్రారంభం!
జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి ఇటీవల ముగిసిన 2013 ఈఐసిఎమ్ఏ అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షోలో ఆవిష్కరించిన '2014 కవాసకి జెడ్1000' స్పోర్ట్స్ బైక్‌ను ఇండియన్ మార్కెట్‌కు తీసుకురానున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా.. అప్‌డేట్ ప్రకారం, కవాసకి డీలర్లు ఈ కొత్త జెడ్1000 బైక్ కోసం అనధికారిక బుకింగ్‌లను స్వీకరిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం కవాసకి భారత మార్కెట్లో నిన్జా జెడ్ఎక్స్-10ఆర్, జెడ్ఎక్స్-14ఆర్, నిన్జా 300ఆర్, నిన్జా 650ఆర్ అనే నాలుగు మోడళ్లను విక్రయిస్తుంది. ఇందులో రెండు మోడళ్లు (జెడ్ఎక్స్-10ఆర్, జెడ్ఎక్స్-14ఆర్) సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లు కాగా, మిగిలిన రెండు మోడళ్లు (300ఆర్, 650ఆర్) సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) రూట్లో విడిభాగాలుగా దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తున్నారు.
జెడ్1000 స్ట్రీట్ ఫైటర్ బైక్ విషయానికి వస్తే, కవాసకి వచ్చే నెలలో ఈ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉంది. జనవరి నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయని అంచనా. కవాసకి జెడ్1000 స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కవాసకి జెడ్1000 సూపర్‌బైక్‌లో కొత్త ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్ డిజైన్ చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. అంతేకాదు.. ఓ జపనీస్ స్పోర్ట్ బైక్‌లో ఎల్ఈడి హెడ్‌లైట్లను ఉపయోగించటం కూడా ఇదే మొదటిసారి.

కవాసకి జెడ్1000 బైక్‌లో శక్తివంతమైన 1043సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 హార్స్ పవర్‌ల శక్తిని, 111 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. (ఇది రీట్యూన్ చేయబడిన ఇంజన్).

బ్రేక్ మోనోబ్లాక్ కాలిపర్స్‌ను టోకికో గ్రిప్పింగ్ పెటల్ బ్రేక్ డిస్క్స్ నుంచి గ్రహించారు. మాస్టర్ సిలిండర్‌లో చేసిన ఇంప్రూవ్‌మెంట్స్ కూడా బ్రేకింగ్ పెర్ఫామెన్స్‌ను మెరుగుపరచాయి.

షోవా బిగ్ పిస్టన్ ఫోర్క్ నుంచి గ్రహించిన సస్పెన్షన్ కూడా మరింత సౌకర్యవంతమైన రైడ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఫుల్ ట్యాంక్ ఇంధనంతో (17 లీటర్లు) కలిపి 2014 కవాసకి జెడ్1000 మొత్తం బరువు 221 కేజీలు.

కొత్త 2014 కవాసకి జెడ్1000 బైక్ ధర 11,999 డాలర్లుగా నిర్ణయించారు. మునుపటి వెర్షన్ ధర కన్నా దీని ధర 1,000 డాలర్లు అధికం.

కవాసకి జెడ్1000 బైక్ గోల్డెన్ బ్లేజ్డ్ గ్రీన్, మెటాలిక్ గ్రాఫైట్ గ్రే రంగులలో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








