ఈ ఏడాది ద్వితీయార్థంలో కవాసకి జెడ్250 బైక్ విడుదల

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి, భారత మార్కెట్లో మంచి జోరు మీదుంది. ఈ ఏడాది జనవరి నెలలో కవాసకి విడుదల చేసిన జెడ్800 (Kawasaki Z800) నేక్డ్ స్పోర్ట్స్ బైక్‌కు దిగువన అదే స్టయిలింగ్‌తో కూడిన మరో సరికొత్త లో-ఎండ్ మోడల్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

కవాసకి జెడ్800 కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యంతో తయారు చేసిన 250సీసీ వెర్షన్ 'కవాసకి జెడ్250' (Kawasaki Z250) బైక్‌ని ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి భారత్‌లో విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఈ రెండు బైక్‌లు (జెడ్800, జెడ్250) చూడటానికి ఒకే మాదిరిగా కనిపిస్తాయి.

కవాసకి ఈ బైక్‌ని గడచిన సంవత్సరంలో జపాన్‌లో జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించింది. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కవాసకి జెడ్250 బైక్

కవాసకి నిన్జా 300 బైక్‌లోని అల్లాయ్ వీల్ డిజైన్, క్రోమ్ ప్లేటెడ్ ఎగ్జాస్ట్ డిజైన్ వంటి కొన్ని డిజైన్ ఫీచర్లు ఈ కొత్త కవాసకి జెడ్250 నేక్డ్ స్పోర్ట్స్ బైక్‌లో కనిపిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, కంపెనీ నిలిపివేసిన ఫెయిర్డ్ వెర్షన్ నిన్జా 250 బైక్‌కు నేక్డ్ వెర్షనే ఈ కొత్త జెడ్250.

కవాసకి జెడ్250 బైక్

కొత్త కవాసకి జెడ్250 బైక్‌లో 249సీసీ, ఫ్యూయెల్ ఇంజక్టెడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 33 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

కవాసకి జెడ్250 బైక్

మెరుగైన మైలేజ్ కోసం ఇందులో డ్యూయెల్ థ్రోటల్ వాల్వ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

కవాసకి జెడ్250 బైక్

డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రంట్ అండ్ రియర్ సింగిల్ డిస్క్ బ్రేక్, మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లను ఇందులో ఆఫర్ చేస్తున్నారు.

కవాసకి జెడ్250 బైక్

ఇందులో 17 ఇంచ్ టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 110/70 సెక్షన్ టైర్స్ మరియు వెనుక వైపు 140/70 సెక్షన్స్ టైర్స్ అమర్చారు.

కవాసకి జెడ్250 బైక్

కవాసకి తమ జెడ్250 బైక్‌ని ఈ ఏడాది మధ్య భాగం నాటికి విడుదల చేయవచ్చని తెలుస్తోంది. భారత మార్కెట్ దీని ధర రూ.2.50 లక్షలకు దిగువనే ఉండొచ్చని అంచనా.

More from DriveSpark

Article Published On: Wednesday, February 26, 2014, 18:12 [IST]
English summary
The entry level performance motorcycle segment is fast becoming as crowded as the commuter bike segment in India. Nearly half a dozen new small displacement sports bikes will be debuting in India this year and joining that list will be the Kawasaki Z250.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+