విడుదలకు సిద్ధమవుతున్న కవాసకి జెడ్250 బైక్
కవాసకి జెడ్250 నేక్డ్ స్పోర్ట్స్ బైక్ విడుదలకు ముహుర్తం దగ్గరపడినట్లు తెలుస్తోంది. జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి, ఈ ఏడాది జనవరి నెలలో విడుదల చేసిన కవాసకి జెడ్800 (Kawasaki Z800) నేక్డ్ స్పోర్ట్స్ బైక్‌కు దిగువన అదే స్టయిలింగ్‌తో కూడిన, 250సీసీ వేరియంట్ (కవాసకి జెడ్250)ను మరో రెండు మూడు నెలల్లో దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు సమాచారం.
కవాసకి జెడ్800 మరియు కవాసకి జెడ్250 రెండు బైక్‌లు కూడా చూడటానికి ఒకే మాదిరిగా కనిపిస్తాయి. కవాసకి ఈ బైక్‌ని గడచిన సంవత్సరంలో జపాన్‌లో జరిగిన 2013 టోక్యో మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించింది. కవాసకి నిన్జా 300 బైక్‌లోని అల్లాయ్ వీల్ డిజైన్, క్రోమ్ ప్లేటెడ్ ఎగ్జాస్ట్ డిజైన్ వంటి కొన్ని డిజైన్ ఫీచర్లు ఈ కొత్త కవాసకి జెడ్250 నేక్డ్ స్పోర్ట్స్ బైక్‌లో కనిపిస్తాయి.

సింపుల్‌గా చెప్పాలంటే, కంపెనీ నిలిపివేసిన ఫెయిర్డ్ వెర్షన్ నిన్జా 250 బైక్‌కు నేక్డ్ వెర్షనే ఈ కొత్త జెడ్250. ఈ బైక్‌లో 249సీసీ, ఫ్యూయెల్ ఇంజక్టెడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 33 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మెరుగైన మైలేజ్ కోసం ఇందులో డ్యూయెల్ థ్రోటల్ వాల్వ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ ఇంజన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రంట్ అండ్ రియర్ సింగిల్ డిస్క్ బ్రేక్, మోనోషాక్ సస్పెన్షన్ వంటి ఫీచర్లను ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 17 ఇంచ్ టెన్ స్పోక్ అల్లాయ్ వీల్స్, ముందు వైపు 110/70 సెక్షన్ టైర్స్ మరియు వెనుక వైపు 140/70 సెక్షన్స్ టైర్స్ అమర్చారు. భారత మార్కెట్ దీని ధర రూ.2.50 లక్షలకు దిగువనే ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








