టోక్యో మోటార్ షో: కవాసకి జెడ్250 బైక్ ఆవిష్కరణ

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి ఇటీవల ఆవిష్కరించిన జెడ్1000 (Kawasaki Z1000) నేక్డ్ స్పోర్ట్స్ బైక్‌ను ఆధారంగా చేసుకొని, తక్కువ ఇంజన్ సామర్థ్యంతో తయారు చేసిన జెడ్250 (Kawasaki Z250) బైక్‌ని ప్రస్తుతం జపాన్‌లో జరుగుతున్న 43వ అంతర్జాతీయ టోక్యో మోటార్ షోలో కవాసకి విడుదల చేసింది.

కవాసకి నిన్జా 300 బైక్‌లోని అల్లాయ్ వీల్ డిజైన్, క్రోమ్ ప్లేటెడ్ ఎగ్జాస్ట్ డిజైన్ వంటి కొన్ని డిజైన్ ఫీచర్లు ఈ కొత్త కవాసకి జెడ్250 నేక్డ్ స్పోర్ట్స్ బైక్‌లో కనిపిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, కంపెనీ నిలిపివేసిన ఫెయిర్డ్ వెర్షన్ నిన్జా 250 బైక్‌కు నేక్డ్ వెర్షనే ఈ కొత్త జెడ్250.


కొత్త కవాసకి జెడ్250 బైక్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, ఇందులోని 249సీసీ, ఫ్యూయెల్ ఇంజక్టెడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 33 హెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా.

డైమండ్ టైప్ స్టీల్ ఫ్రేమ్, టెలిస్కోపిక్ ఫోర్క్, ఫ్రంట్ అండ్ రియర్ సింగిల్ డిస్క్ బ్రేక్, మోనోషాక్ సస్పెన్షన్ వంటి డిజైన్ ఫీచర్లను ఇందులో గమనించవచ్చు. కవాసకి తమ కొత్త జెడ్250 బైక్‌ను ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Kawasaki Z250 Showcased At Tokyo Motor Show

ఇదిలా ఉండగా, సరికొత్త కవాసకి జెడ్1000 స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ వచ్చే నెలలో భారత మార్కెట్లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బైక్ కోసం అనధికారిక బుకింగ్‌లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, November 22, 2013, 16:08 [IST]
English summary
Kawasaki Z250 naked sports bike has been showcased at the Tokyo Motor Show. The quarter liter sports bike resembles its liter class counterpart, the Z1000, but one that's been toned down and less muscular. Kawasaki Z250 also takes styling cues from Ninja 300, such as the alloy wheel design and the chrome plated exhaust can.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+