కవాసకి జెడ్800 ధరలో రూ.50,000 తగ్గింపు
జపాన్‌కి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి గడచిన జనవరి 2014 నెలలో మార్కెట్లో విడుదల చేసిన తమ సరికొత్త కవాసకి జెడ్800 నేక్డ్ స్ట్రీట్ బైక్ ధరను భారీగా తగ్గించింది. ఈ మోడల్‌పై కంపెనీ ఏకంగా రూ.50,000 తగ్గింపును ప్రకటించింది. థాయ్‌లాండ్ మార్కెట్లో ఈ మోడల్ ధరలు తగ్గిన నేపథ్యంలో, ఇండియాలో కూడా దీని ధరలను తగ్గించారు.
భారత్‌లో విక్రయిస్తున్న కవాసకి జెడ్800 మోడల్‌ను థాయ్‌లాండ్ మార్కెట్ నుంచి ఇండియాకు దిగుమతి చేసుకుంటున్నారు. కవాసకి జెడ్800 నేక్డ్ బైక్ కూడా చూడటానికి జెడ్1000 మాదిరిగానే అనిపిస్తుంది. ఈ రెండు బైక్‌ల స్టయిలింగ్ ఇంచు మించు ఒకేలా ఉంటుంది. అయితే, ఇంజన్ మాత్రం భిన్నంగా ఉంటుంది. కవాసకి జెడ్800 బైక్‌లో పేరుకు తగినట్లుగానే 806సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

కవాసకి జెడ్800 బైక్‌లో 806సీసీ లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,200 ఆర్‌పిఎమ్ వద్ద 113 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 83 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








