జనవరిలో భారత్‌లో విడుదల కానున్న కవాసకి జెడ్800

By Ravi

భారత్‌లో ప్రీమియం బైక్ సెగ్మెంట్ శరవేగంగా విస్తరిస్తోంది, ఈ విభాగంలో రోజుకో కొత్త మోడల్ మార్కెట్లోకి విడుదలవుతుంది. ఇటీవలే జె1000 నేక్డ్ బైక్, నిన్జా 1000 స్పోర్ట్స్ బైక్‌లను విడుదల చేసిన జపనీస్ టూవీలర్ దిగ్గజం కవాసకి, తాజాగా మరో ప్రీమియం బైక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, జనవరి 2014లో ఇది విడుదల కానుంది.

కవాసకి జెడ్ సిరీస్‌లో విడుదలై జెడ్1000 బైక్‌కు దిగువన జె800 అనే బైక్‌ను కంపెనీ ప్రవేశపెట్టనుంది. కవాసకి జెడ్800 నేక్డ్ బైక్ కూడా చూడటానికి జెడ్1000 మాదిరిగానే అనిపిస్తుంది. ఈ రెండు బైక్‌ల స్టయిలింగ్ ఇంచు మించు ఒకేలా ఉంటుంది. అయితే, ఇంజన్ మాత్రం భిన్నంగా ఉంటుంది. కవాసకి జెడ్800 బైక్‌లో పేరుకు తగినట్లుగానే 800సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

కవాసకి జెడ్800 బైక్‌లో 806సీసీ లిక్విడ్ కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ గరిష్టంగా 10,200 ఆర్‌పిఎమ్ వద్ద 113 పిఎస్‌ల శక్తిని, 8000 ఆర్‌పిఎమ్ వద్ద 83 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ బైక్‌కు సంబంధించి ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

Kawasaki Z800

More from DriveSpark

Article Published On: Saturday, December 28, 2013, 10:35 [IST]
English summary
Kawasaki Z800 is powered by a 806 cc liquid cooled, fuel injected, in-line four cylinder engine. The engine generates 113 PS power at 10,200 rpm and a peak torque of 83 Nm at 8,000 rpm and is mated to a 6 speed transmission.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+