డ్యూక్ 690 బైక్‌ను భారత్‌లో విడుదల చేయనున్న కెటిఎమ్

స్పోర్ట్స్ బైక్ ప్రియులకు మరో గుడ్ న్యూస్. ఇండో-ఆస్ట్రియన్ భాగస్వామ్య కంపెనీ అయిన బజాజ్-కెటిఎమ్ భారత మార్కెట్లో మరో కొత్త పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బైక్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన మిడ్-సైజ్ నేక్డ్ బైక్ డ్యూక్ 390 భారీ సక్సెస్‌ను సాధించడంతో, ఇందులో మరింత శక్తివంతమైన ఇంజన్ కలిగిన వెర్షన్ తీసుకువచ్చేందుకు కెటిఎమ్ సన్నాహాలు చేస్తుంది.

కెటిఎమ్ సీఈఓ స్టీఫన్ పీరెర్ మాట్లాడుతూ.. భారత మార్కెట్లో తమ ప్రీమియం బైక్ కెటిఎమ్ 690 డ్యూక్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని, 2015 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కొత్త కెటిఎమ్ 690 డ్యూక్ బైక్ ఈ సిరీస్‌లోని 39 డ్యూక్, 200 డ్యూక్, 125 డ్యూక్ ఫ్లాట్‌ఫామ్‌లను షేర్ చేసుకోదు. దీనిని పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు చేస్తున్నారు.


కెటిఎమ్ 390 డ్యూక్‌లో 690సీసీ, లిక్విడ్ కూల్డ్, 69 హెచ్‌పి ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 6 స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇతర కెటిఎమ్ బైక్‌ల మాదిరిగానే 690 డ్యూక్ కూడా తేలిక బరువును కలిగి ఉంటుంది (మొత్తం బరువు 149.5 కేజీలు మాత్రమే). ఇందులో బాష్ ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) స్టాండర్డ్ ఫీచర్‌గా లభిస్తుంది.

కెటిఎమ్ ప్రస్తుతం భారత్‌లో ఉత్పత్తి చేస్తున్న డ్యూక్ 300, డ్యూక్ 200 మోడళ్ల ప్లాట్‌ఫామ్‌ను ఈ కొత్త డ్యూక్ 690 షేర్ చేసుకోదు కాబట్టి, దీనిని సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) కిట్లుగా ఇక్కడికి దిగుమతి చేసుకొని, అసెంబ్లింగ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, భారత మార్కెట్లో అసెంబ్లింగ్ అయిన 390 డ్యూక్ బైక్‌లను కెటిఎమ్ పొరుగు దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది.

KTM 690 Duke

దీన్ని బట్టి చూస్తుంటే, కెటిఎమ్ డ్యూక్ 690 బైక్ సరసమైన ధరకే లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ బైక్‌ను పొందాలంటే మరో ఏడాది పాటు ఆగాల్సిందే. మరి బజాజ్-కెటిఎమ్ ఈ బైక్‌ను ఎంత ధరకు ఆఫర్ చేస్తే బాగుంటుందో మీరే చెప్పండి?

More from DriveSpark

Article Published On: Monday, November 25, 2013, 7:25 [IST]
English summary
The Bajaj-KTM alliance has reached a stage where the duo are confident about launching larger and larger motorcycles that sell in lower volumes. Sparked by the success of the 200 Duke and 390 Duke in India and abroad the company has decided to introduce the more premium 690 Duke in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+