వచ్చే నెలలో మార్కెట్లోకి రానున్న కెటిఎమ్ డ్యూక్ 390

By Ravi

బజాజ్-కెటిఎమ్ నుంచి మరొక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బైక్ త్వరలోనే మార్కెట్లో విడుదల కానుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, 'కెటిఎమ్ డ్యూక్ 390' బైక్‌ను మే నెలలో విడుదల చేయాలని బజాజ్ ఆటో సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బైక్ ఉత్పత్తి పూనేలోని తమ ప్లాంటులో ప్రారంభించినట్లు కూడా సమాచారం.

కాగా.. కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్లో అందిస్తున్న కెటిఎమ్ డ్యూక్ 200 బైక్‌లో స్థానికంగా లభ్యమయ్యే టైర్లను ఉపయోగిస్తుండగా, ఈ వవర్‌‌ఫుల్ డ్యూక్ 390లో ఇంపోర్టెడ్ మెట్జ్లర్ టైర్లను అమర్చనున్నారు. ఈ పవర్‌ఫుల్ వెర్షన్ కెటిఎమ్ డ్యూక్ 390 బైక్‌లో మరింత మెరుగైన రోడ్ గ్రిప్ మరియు ఆఫ్ రోడింగ్ పెర్ఫామెన్స్‌కు ధీటుగా ఉంచేందుకు గాను మెట్జ్లర్ టైర్లను ఉపయోగించనున్నారు. త్వరలోనే ఈ టైర్లు బజాజ్-కెటిఎమ్ డీలర్‌షిప్ కేంద్రాల్లో లభ్యం కానున్నాయి.

ఈ బైక్‌ను స్థానికంగానే ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో, ఇది సరమైన ధరకే మార్కెట్లో అందుబాటులోకి రానుంది. దేశీయ విపణిలో కెటిఎమ్ డ్యూక్ 390 బైక్ ధర రూ.2 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఈ బైక్ బరువును తేలికగా ఉంచేలా దీని బాడీ నిర్మాణంలో తేలికపాటి ధృడమైన మెటీరియల్స్‌ను ఉపయోగించారు. దీని మొత్తం బరువు కేవలం 139 కేజీలు మాత్రమే. మే 2013లో ఈ బైక్ మార్కెట్లో విడుదల కానుంది. డెలివరీలు మాత్రం జూన్ 2013లో ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

KTM Duke 390 To Be Launched In May 2013

More from DriveSpark

Article Published On: Monday, April 22, 2013, 11:50 [IST]
English summary
As we reported earlier about KTM Duke 390 launh, it is now being confirmed that KTM's Duke 390 would be launched in India in May 2013 and the deliveries of the bike would start in June 2013. Stay tuned for more updates.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+