కెటిఎమ్ డ్యూక్ 390 వెయిటింగ్ పీరియడ్ ఎంత?

By Ravi

బజాజ్-కెటిఎమ్ ఇటీవలే సరమైన ధరకే భారత మార్కెట్లో విడుదల చేసిన మిడ్-రేంజ్ స్పోర్ట్స్ బైక్ 'కెటిఎమ్ డ్యూక్ 390' హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. డ్యూక్ 200 సక్సెస్ అయినట్లుగానే, డ్యూక్ 390కి కూడా మంచి డిమాండ్ లభిస్తోంది. ఈ మోడల్ పూనేలోని బజాజ్ ఆటో ఛాకన్ ప్లాంటులో ఉత్పత్తి అవుతోంది. ఈ ప్లాంటులో కార్మికుల వేతనాల సవరింపు కోసం సమ్మె చేస్తున్న సంగతి తెలినదే. ఈ నేపథ్యంలో కెటిఎమ్ డ్యూక్ 390 వెయిటింగ్ పీరియడ్ భారీగా పెరిగిపోతుంది.

ప్రస్తుతం ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలనుకున్న బైక్ ప్రియులు కనీసం 3 నెలల వరకూ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఛాకన్ ప్లాంటులో పల్సర్, డ్యూక్ మోడళ్లు ఉత్పత్తి అవుతున్నాయి. కాగా, పల్సర్ ఉత్పత్తిని కంపెనీ ఔరంగాబాద్‌లోని వాలుజ్ ప్లాంట్‌కు తరలించారు. డ్యూక్ ఉత్పత్తిని మాత్రం ఛాకన్ ప్లాంటులోనే కొద్దిపాటి కార్మికులతో తయారు చేస్తున్నారు. ఛాకన్ ప్లాంటులో సమ్మె త్వరగా సద్దుమణగకుంటే డ్యూక్ మోడళ్ల వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగినా అశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

KTM Duke 390

కెటిఎమ్ డ్యూక్ 390 బైక్ విషయానికి వస్తే, ఏబిఎస్, మెట్‌జెలెర్ టైర్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్, సాటిలేని పవర్‌ వంటి ఫీచర్లోతో ఇది రేసింగ్, సిటీ, హైవే రైడ్‌లకు అనువుగా ఉంటుంది. ఈ బైక్‌లో ఉపయోగించిన 373.2సీసీ ఇంజన్ గరిష్టంగా 43.5 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 71 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్, సర్వీస్ సెంటర్ల ద్వారా 390 డ్యూక్ లభ్యం కానుంది.

డ్యూక్ 390 పవర్ టు రేషియో (పిటిడబ్ల్యూ) టన్నుకు 300 పిఎస్‌లు. ఈ పిటిడబ్ల్యూతో ఇది సాటిలేని పికప్‌ను, గరిష్ట వేగాన్ని ఆఫర్ చేస్తుంది. భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ బైక్ సస్పెన్షన్‌ను ట్యూన్ చేశారు. ముందు వైపు 300 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 మి.మీ. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 145 కిలోల బరువు, మెట్‌జెలెర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు, స్పోర్టీ డిజైన్ వంటి ప్రధాన ఫీచర్లు కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ సొంతం. భారత మార్కెట్లో కెటిఎమ్ 390 డ్యూక్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 23, 2013, 11:51 [IST]
English summary
The KTM 390 Duke was launched at an introductory price of Rs. 1.80 Lakhs (ex-showroom Delhi) a month ago. Company has been producing this model at Chakan plant. But due to the workers strike at Chakan plant, there are chance that Duke 390 waiting period may gone up by more than tree months.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+