కెటిఎమ్ డ్యూక్ 390 స్పోర్ట్ బైక్ విడుదల తేది ఖరారు
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్ భారత మార్కెట్లో తమ రెండవ ఉత్పత్తిని ప్రవేశపెట్టేందుకు ముహుర్తం ఖరారు చేసింది. దేశీయ విపణిలో కెటిఎమ్ అందిస్తున్న డ్యూక్ 200 స్పోర్ట్స్ బైక్ మంచి సక్సెస్‌ను సాధించడంతో, ఇందులో మరింత పవర్‌ఫుల్ వెర్షన్ బైక్‌ను కంపెనీ ఈనెల 25న మార్కెట్లో విడుదల చేయనుంది. 373సీసీ ఇంజన్‌తో కూడిన కెటిఎమ్ డ్యూక్ 390 స్పోర్ట్స్ బైక్‌ను కంపెనీ జూన్ 25, 2013న భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తమ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.
కెటిఎమ్ భారత ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్‌తో భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. కెటిఎమ్ డ్యూక్ 390 స్పోర్ట్స్ బైక్‌ను పూనేలో ఉన్న బజాజ్ ఆటో ప్లాంటులో ఉత్పత్తి చేస్తున్నారు. గడచిన నెలలో ఆస్ట్రియాలో కెటిఎమ్ ఓ అంతర్జాతీయ మీడియా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భారతీయ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొని ఈ సరికొత్త కెటిఎమ్ డ్యూక్ 390 స్పోర్ట్స్ బైక్‌ను టెస్ట్ చేశారు. ఇదొక అమేజింగ్, పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బైక్ అని వారు చెబుతున్నారు.
కెటిఎమ్ డ్యూక్ 390 బైక్‌లో 373సీసీ పవర్‌ఫుల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 43 హార్స్ పవర్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో పెద్ద ఇంజన్‌తో పాటు మరిన్ని విశిష్టమైన ఫీచర్లను గమనించవచ్చు. డ్యూక్ 200లో ఉపయోగించిన ఎమ్ఆర్ఎఫ్ టైర్లకు బదులుగా డ్యూక్ 390లో మెట్‌జెలర్ టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లు మరింత ఎక్కువ రోడ్ గ్రిప్‌ను కలిగి ఉండ మంచి పెర్ఫామెన్స్‌ను అందిస్తాయి. ఆప్షనల్‌గా ఏబిఎస్ ఫీచర్ అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. దేశీయ విపణిలో ఈ బైక్ ధర రూ.2 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

కెటిఎమ్ డ్యూక్ 390 టీజర్ ఫొటో

కెటిఎమ్ డ్యూక్ 390 టీజర్ ఫొటో

కెటిఎమ్ డ్యూక్ 390

డ్యూక్ 390

డ్యూక్ 390 విడుదల తేది ఖరారు

కెటిఎమ్ డ్యూక్ 390 స్పోర్ట్ బైక్

కెటిఎమ్ డ్యూక్ 390 వీలీ

రేస్ ట్రాక్‌పై కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ డ్యూక్ 390



Click it and Unblock the Notifications








