చెన్నై మార్కెట్లో కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల
ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్ మరియు దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటోలు సంయుక్తంగా ఇటీవలే భారత మార్కెట్లో విడుదల చేసిన 'కెటిఎమ్ డ్యూక్ 390' స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు చెన్నై మార్కెట్లో కూడా లభ్యం కానుంది. చెన్నై మార్కెట్లో ఈ బైక్ ధర రూ.1.83 లక్షలు ఎక్స్-షోరూమ్, చెన్నై)గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. బజాజ్ ప్రోబైకింగ్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ నంది కెటిఎమ్ డ్యూక్ 390 బైక్‌ను చెన్నైలో విడుదల చేశారు. చెన్నైలో ఇది అడయార్ కెటిఎమ్, మోగప్పయ్యర్ కెటిఎమ్ డీలర్ల ద్వారా అందుబాటులో ఉంటుంది.
ఏబిఎస్, మెట్‌జెలెర్ టైర్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్, సాటిలేని పవర్‌లతో ఇది రేసింగ్, సిటీ, హైవే రైడ్‌ల కోసం చక్కగా సరిపోతుంది. ఈ బైక్‌లో ఉపయోగించిన 373.2సీసీ ఇంజన్ గరిష్టంగా 43.5 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది.

భారతదేశంలోనే ఇది తొలి మిడ్-సైజ్ స్పోర్ట్స్ బైక్ కావటం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న 71 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్, సర్వీస్ సెంటర్ల ద్వారా 390 డ్యూక్ లభ్యం కానుంది. దీని పవర్ టు రేషియో (పిటిడబ్ల్యూ) టన్నుకు 300 పిఎస్‌లు. ఈ పిటిడబ్ల్యూతో ఇది సాటిలేని పికప్‌ను, గరిష్ట వేగాన్ని ఆఫర్ చేస్తుంది. పవర్‌ఫుల్ ఇంజన్, లైట్ వెయిట్ మరియు ఈజీ హ్యాండ్లింగ్ ఫీచర్లతో కూడిన 390 డ్యూక్ ప్రొఫెషనల్ రైడర్లకు అలాగే స్పోర్టీ రైడ్ కోరుకునే వారికి చక్కటి ఆప్షన్‌గా ఉంటుంది.
భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ బైక్ సస్పెన్షన్‌ను ట్యూన్ చేశారు. ముందు వైపు 300 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 మి.మీ. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 145 కిలోల బరువు, మెట్‌జెలెర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు, స్పోర్టీ డిజైన్ వంటి ప్రధాన ఫీచర్లు కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ సొంతం.


Click it and Unblock the Notifications








