జూన్ 25న విడుదల కానున్న కెటిఎమ్ డ్యూక్ 390

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్‌ కంపెనీ కెటిఎమ్, భారత మార్కెట్లో మరొక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ బైక్‌ 'డ్యూక్ 390'ని రేపు (జూన్ 25, 2013) మార్కెట్లో విడుదల చేయనుంది. రేసీ ఇంజన్, స్పోర్టీ రైడ్‌తో భారత బైక్ ప్రియులను ఆకట్టుకున్న కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ మాదిరిగానే డ్యూక్ 390 కూడా మంచి సక్సెస్‌ను సాధించగలదని కంపెనీ ఆశిస్తోంది.

ఇది ఈ సెగ్మెంట్లోని కవాసకి నిన్జా 300, హోండా సిబిఆర్ 250ఆర్ వంటి స్పోర్ట్స్ బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో ఉపయోగించిన 375సీసీ, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఫ్యూయెల్ ఇంజెక్టడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 43 బిహెచ్‌పిల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో పెద్ద ఇంజన్‌తో పాటు మరిన్ని విశిష్టమైన ఫీచర్లను గమనించవచ్చు.

డ్యూక్ 200లో ఉపయోగించిన ఎమ్ఆర్ఎఫ్ టైర్లకు బదులుగా డ్యూక్ 390లో మెట్‌జెలర్ టైర్లను ఉపయోగించారు. ఈ టైర్లు మరింత ఎక్కువ రోడ్ గ్రిప్‌ను కలిగి ఉండ మంచి పెర్ఫామెన్స్‌ను అందిస్తాయి. ఆప్షనల్‌గా ఏబిఎస్ ఫీచర్ అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. దేశీయ విపణిలో ఈ బైక్ ధర రూ.2 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌‍డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

కెటిఎమ్ డ్యూక్ 390

బోల్డ్ '390' స్టిక్కర్‌తో కూడిన 11 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్.

కెటిఎమ్ డ్యూక్ 390

ఇందులో ఉపయోగించిన 375సీసీ, సింగిల్ సిలిండర్, ఫోర్-స్ట్రోక్, ఫ్యూయెల్ ఇంజెక్టడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 43 బిహెచ్‌పిల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కెటిఎమ్ డ్యూక్ 390

అన్ని వాతావరణ పరిస్థితుల్లోను మంచి ట్రాక్షన్, స్టెబిలిటీ కోసం ఇందులో మెట్‌జెలర్ స్పోర్టెక్ ఎమ్5 టైరును ఉపయోగించారు.

కెటిఎమ్ డ్యూక్ 390

స్టంట్స్, వీలీ చేయటానికి ఇది చక్కగా సూట్ అవుతుంది.

కెటిఎమ్ డ్యూక్ 390

లుక్ పరంగా ఇది డ్యూక్ 200 మాదిరిగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Monday, June 24, 2013, 12:30 [IST]
English summary
After eight months of waiting Indian bike enthusiasts will finally get the KTM Duke 390 on June 25th, a Tuesday. The confirmation came late yesterday, in the form of a wallpaper on KTM's facebook page, which you can see for yourself in the gallery below.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+