స్వంత ఇంజన్ మ్యాప్స్‌ను ఆఫర్ చేయనున్న కెటిఎమ్

By Ravi

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ త్వరలోనే తమ స్వంత 'ఇంజన్ మ్యాప్స్'ను కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. ఇలా చేయటం వలన కెటిఎమ్, భారతదేశంలో కెల్లా స్వంత ఇంజన్ మ్యాప్‌లను ఆఫర్ చేసిన మొట్టమొదటి తయారీదారుగా చరిత్రలో నిలిచిపోనుంది.

ఇంతకీ ఇంజన్ మ్యాప్స్ అంటే ఏంటనే కదా మీ సందేహం. ఇంజన్ మ్యాప్స్ అంటే ఇంజన్‌లో ఇంధనాన్ని ఎలా మండించాలి, తద్వారా పవర్‌ను ఎలా డెలివరీ చేయాలని సూచనలు జారీ చేసేవి. విభిన్న రకాల ఇంజన్ మ్యాప్స్ ఇంజన్ నుంచి విభిన్న రకాల రెస్పాన్స్‌లను వెలికి తీస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, బైక్ పెర్ఫార్మెన్స్‌ను మెరుగుపరచుకునేందుకు ఈ ఇంజన్ మ్యాప్స్ సహకరిస్తాయి.


అనేక మంది కెటిఎమ్ బైక్ ఓనర్లు ఆఫ్టర్ మార్కెట్ (థర్డ్ పార్టీల నుంచి కొనుగోలు చేసే) ఇంజన్ మ్యాప్స్‌ను తమ బైక్స్ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే, బైక్ వారంటీ పీరియడ్‌లో ఉన్నప్పుడు ఇలాంటి మోడిఫికేషన్లు చేయటం వలన కంపెనీ నిబంధనల ప్రకారం, వారంటీ వర్తించదు. అయితే, కెటిఎమ్ ఆస్ట్రియా సర్టిఫై చేయబడిన ఈ ఇంజన్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తే, వారంటీ పోతుందన్న భయం ఉండదు.

పైగా కెటిఎమ్ ద్వారా ఆఫర్ చేయబడే ఈ ఇంజన్ మ్యాప్స్ అనేక టెస్ట్‌లను పాస్ అవుతాయి, కాబట్టి విశ్వసనీయత సమస్య కూడా ఉండదు. కెటిఎమ్ భారత్‌లో రెండు రకాల ఇంజన్ మ్యాప్‌లను ఆఫర్ చేయనుంది. ఇందులో ఒకటి బైక్ పెర్ఫార్మెన్స్‌ను పెంచడం కోసం, మరొకటి సిటీ ఉపయోగం కోసం. కెటిఎమ్ సర్వీస్ సెంటర్లలో ఈసియూలో ఇన్‌స్టాల్ చేస్తారు, ఇందులో ఒక్క ఇంజన్ మ్యాప్ మాత్రమే పడుతుంది.

KM Bike

ప్రస్తుత డ్యూక్ రేంజ్ బైక్‌లు మరియు త్వరలో రానున్న ఆర్‌స సిరీస్ బైక్‌లలో ఈ సర్టిఫైడ్ ఇంజన్ మ్యాప్‌లను ఉపయోగించనున్నారు. ఇదిలా ఉండగా.. కెటిఎమ్ తమ వినియోగదారుల కోసం 24X7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రాంభించేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆరెంజ్ అసిస్ట్ అని పిలువనున్నారు. కెటిఎమ్ సర్వీస్ సెంటర్లకు సుమారు 100 కి.మీ. దూరం వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 30, 2014, 15:36 [IST]
English summary
KTM will soon become the first manufacturer in India to offer its own engine maps to customers. Simply put, engine maps are a set of instructions that tell the engine how to burn fuel and how to deliver power. Different engine maps will extract a different response from the engine and are most often used to increase a bike's performance.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+