కెటిఎమ్ డ్యూక్ 390 స్పోర్ట్స్ బైక్ కోసం కొత్త కలర్ ఆప్షన్

By Ravi

కెటిఎమ్ బైక్ ప్రియులకు మరో గుడ్ న్యూస్.. ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్ గడచిన జూన్ నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన 'కెటిఎమ్ డ్యూక్ 390' ఇప్పుడు మరో కొత్త ఆకర్షనీయమైన రంగులో లభ్యం కానుంది. కెటిఎమ్ డ్యూక్‌ను తొలుత వైట్ కలర్‌లో మాత్రమే విడుదల చేశారు. తాజాగా, ఇందులో ఆల్-బ్లాక్ కలర్‌ను కంపెనీ పరిచయం చేసింది.

అయితే, ఈ బ్లాక్ కలర్ కెటిఎమ్ డ్యూక్ 390 ఇంకా డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోలేదు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం బ్లాక్ కలర్‌ను ఆఫర్ చేస్తున్నట్లు పేర్కొనబడి ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో ఈ బైక్ కోసం మూడు నెలలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్ ఇప్పుడు నెల రోజులకు తగ్గిందని సదరు డీలర్లు చెబుతున్నారు.

మరి ఈ కొత్త బ్లాక్ కలర్ కెటిఎమ్ డ్యూక్ 390 డీలర్‌షిప్‌లకు ఎప్పుడు చేరుతుందో వేచి చూడాలి. ఈలోపుగా డ్యూక్ 390 బైక్‌కి సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

కెటిఎమ్ డ్యూక్ 390

ఏబిఎస్, మెట్‌జెలెర్ టైర్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లతో కెటిఎమ్ 390 డ్యూక్ బైక్‌ను తయారు చేశారు.

కెటిఎమ్ డ్యూక్ 390

కెటిఎమ్ 390 డ్యూక్ బైక్‌లో 373.2సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 43.5 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది.

కెటిఎమ్ డ్యూక్ 390

దీని పవర్ టు రేషియో (పిటిడబ్ల్యూ) టన్నుకు 300 పిఎస్‌లు. ఈ పిటిడబ్ల్యూతో ఇది సాటిలేని పికప్‌ను, గరిష్ట వేగాన్ని ఆఫర్ చేస్తుంది. పవర్‌ఫుల్ ఇంజన్, లైట్ వెయిట్ మరియు ఈజీ హ్యాండ్లింగ్ ఫీచర్లతో కూడిన 390 డ్యూక్ ప్రొఫెషనల్ రైడర్లకు అలాగే స్పోర్టీ రైడ్ కోరుకునే వారికి చక్కగా సూట్ అవుతుంది.

కెటిఎమ్ డ్యూక్ 390

భారతదేశంలోనే ఇది తొలి మిడ్-సైజ్ స్పోర్ట్స్ బైక్ కావటం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న 71 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్, సర్వీస్ సెంటర్ల ద్వారా 390 డ్యూక్ లభ్యం కానుంది. భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ బైక్ సస్పెన్షన్‌ను ట్యూన్ చేశారు.

కెటిఎమ్ డ్యూక్ 390

ముందు వైపు 300 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 మి.మీ. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 145 కిలోల బరువు, మెట్‌జెలెర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు, స్పోర్టీ డిజైన్ వంటి ప్రధాన ఫీచర్లు కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ సొంతం.

More from DriveSpark

Article Published On: Wednesday, November 13, 2013, 14:21 [IST]
English summary
KTM recently introduced a black paint option for the KTM 390 Duke in international markets. This new colour scheme will be launched in Indian market soon.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+