కెటిఎమ్ ఆర్‌సి 200, ఆర్‌సి 390 విడుదల; ధరలు, ఫీచర్లు

By Ravi

ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ డ్యూక్ సిరీస్ నేక్డ్ బైక్‌ల నుంచి తయారు చేసిన స్పోర్ట్స్ వెర్షన్ బైక్స్ ఆర్‌సి 200 మరియు ఆర్‌సి 390 మోడళ్లను నేడు (సెప్టెంబర్ 9, 2014) మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో వీటి ధరలు ఇలా ఉన్నాయి:

* కెటిఎమ్ ఆర్‌సి 200 - రూ.1.60 లక్షలు
* కెటిఎమ్ ఆర్‌సి 390 - రూ.2.05 లక్షలు
(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

కెటిఎమ్ ఆర్‌సి 200, ఆర్‌సి 390 బైక్‌ల ధరలు కాస్తంత ఎక్కువగానే ఉన్నప్పటికీ, ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న పెర్ఫార్మెన్స్ బైక్‌లలో కెల్లా ఇవి అత్యంత చవక ధరకే లభిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ రెండు మోటార్‌సైకిళ్లకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కెటిఎమ్ ఆర్‌సి 200, 390 విడుదల

ప్రస్తుతం కెటిఎమ్ భారత మార్కెట్లో డ్యూక్ సిరీస్ క్రింద డ్యూక్ 200, డ్యూక్ 390 నేక్డ్ మోటార్‌సైకిళ్లను విక్రయిస్తోంది. వీటికి ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్లే ఈ ఆర్‌సి 200, ఆర్‌సి 390 మోటార్‌సైకిళ్లు. ఈ రెండు కొత్త మోడళ్లను డ్యూక్ సిరీస్ ప్లాట్‌ఫామ్‌లను ఆధారంగా చేసుకొనే తయారు చేస్తున్నారు. డ్యూక్ మోడళ్లలో ఉపయోగించిన ఇంజన్లనే ఆర్‌సి బైక్‌లలోను ఉపయోగిస్తున్నాయి. తర్వాతి స్లైడ్‌లో వీటి ఇంజన్ పెర్ఫార్మెన్స్‌ను వివరాలను తెలుసుకోండి.

కెటిఎమ్ ఆర్‌సి 200, 390 విడుదల

కెటిఎమ్ ఆర్‌సి 200లో 199.5సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 25 బిహెచ్‌పిల శక్తిని, 19.2 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

కెటిఎమ్ ఆర్‌సి 390లో 373.3సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 43 బిహెచ్‌పిల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.
కెటిఎమ్ ఆర్‌సి 200, 390 విడుదల

కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్‌లో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) స్టాండర్డ్‌గా లభిస్తుంది. ఏబిఎస్ అవసరం లేదనుకున్న వారు, ఈ ఫీచర్‌ను స్విచ్ ఆఫ్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. కెటిఎమ్ ఆర్‌సి 200 బైక్‌లో ఏబిఎస్ లేదు, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో పూర్తిగా డిజిటల్ స్పీడో కన్సోల్ ఉంటుంది. వీటిలో ఓ విశిష్టమైన ఫీచర్ ఉంది. అదేంటంటే, సైడ్ స్టాండ్ తీయటం మర్చిపోయి, ఇంజన్ ఆన్ చేసి, గేర్ వేయగానే ఇంజన్ ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. తిరిగి సైడ్ స్టాండ్ తీసివేసి, ఇంజన్ ఆన్ చేసి, గేర్ వేస్తేనే ఇది ముందుకు వెళ్తుంది.

కెటిఎమ్ ఆర్‌సి 200, 390 విడుదల

ఈ రెండు మోటార్‌సైకిళ్లలో ట్విన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఉంటాయి. ఇవి చాలా ఆకర్షనీయంగా అనిపిస్తాయి. కెటిఎమ్ ఆర్‌సి 200 బైక్ బరువు 147.5 కేజీలుగా ఉంటే, కెటిఎమ్ ఆర్‌సి 390 బైక్ బరువు 159.5 కేజీలుగా ఉంది.

కెటిఎమ్ ఆర్‌సి 200, 390 విడుదల

మొత్తమ్మీద ప్రస్తుతం లభిస్తున్న కెటిఎమ్ డ్యూక్ బైక్‌లతో పోల్చుకుంటే కెటిఎమ్ ఆర్‌సి బైక్‌లు మరింత స్పోర్టీగా, స్టయిలిష్‌గా అనిపిస్తాయి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 9, 2014, 17:10 [IST]
English summary
KTM RC 200 and 390cc launched in India. The motorcycles have full body fairing, which sets them apart from the presently selling models. The RC versions also have a reworked rear end. The forward leaning riding position along with the clip on handlebars will make it an amazing bike for the track.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+