కెటిఎమ్ ఆర్‌సి390 కప్ ఆవిష్కరణ, తర్వాత ప్రొడక్షన్ వెర్షన్

By Ravi

ఊహించినట్లుగానే, ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ మేకర్ కెటిఎమ్ ఓ సరికొత్త స్పోర్ట్ బైక్‌ 'కెటిఎమ్ ఆర్‌సి390 కప్' (KTM RC390 Cup) పరదాలను తొలగించింది. కెటిఎమ్ ఇప్పటి వరకు అందిస్తున్న నేక్డ్ బైక్‌లకు (డ్యూక్ వంటి బాడీ ప్యానెల్స్ ఎక్కువగా ఉండని బైక్‌లు) భిన్నంగా పూర్తి బాడీ ప్యానెల్స్‌ను కలిగి ఉండటం ఈ కెటిఎమ్ ఆర్‌సి390 కప్ స్పోర్ట్స్ బైక్ ప్రత్యేకత.

కెటిఎమ్ ద్వారా నిర్వహించబడుతున్న 2014 ఏడిఏసి జూనియర్ కప్‌లో పాల్గొనేందుకు కంపెనీ ఈ కెటిఎమ్ ఆర్‌సి390 బైక్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతానికి ఈ బైక్‌ను రేస్‌లో పాల్గొనేందుకే ఉత్పత్తి చేసినప్పటికీ, వచ్చే ఏడాదిలో ఇందులో ఓ ప్రొడక్షన్ వెర్షన్‌ను కూడా కంపెనీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జర్మనీలోని సాషెన్‌రింగ్ సర్క్యూట్‌లో జరిగిన ఓ మోటోజిపి కార్యక్రమంలో ఆవిష్కరించారు.

కెటిఎమ్ డ్యూక్‌ 390 నేక్డ్ బైక్‌లో ఉపయోగించిన 373సీసీ వంటి ఇంజన్‌ను రీట్యూన్ చేసి ఈ కొత్త స్పోర్ట్స్ బైక్‌లో ఉపయోగించారు. ఈ 373సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 37.5 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ మొత్తం బరువు 130 కిలోలు మాత్రమే. ఈ బైక్ సాంకేతిక వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

ఇంజన్

ఇంజన్

ఇంజన్ - సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్,

డిస్‌ప్లేస్‌మెంట్ - 373.2సీసీ

పవర్ - 38 హార్స్ పవర్

ఫ్యూయెల్ సిస్టమ్ - బాష్ ఈఎఫ్ఐ (త్రోటల్ వాల్వ్ 46 మి.మీ.

కంట్రోల్ - 4 వాల్వ్/డిఓహెచ్‌సి

ఇంజన్

ఇంజన్

ఇంజన్ లూబ్రికేషన్ - వెట్ సంప్ సిస్టమ్

కూలింగ్ సిస్టమ్ - లిక్విడ్

క్లచ్ - మెకానికల్ మల్టీ డిస్క్ క్లచ్ ఇన్ ఆయిల్ బాత్

ఇంజన్ మేనేజ్‍‌మెంట్ - బాష్ ఈఎమ్ఎస్

ఫ్రేమ్, సస్పెన్షన్, బ్రేక్స్

ఫ్రేమ్, సస్పెన్షన్, బ్రేక్స్

ఫ్రేమ్ - స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్, పౌడర్ కోటెడ్

ఫ్రంట్ సస్పెన్షన్ - డబ్ల్యూపి-యూఎస్‌డి ఏ 43 మి.మీ.

రియర్ సస్పెన్షన్ - డబ్ల్యూపి-మోనోషాక్

ఫ్రంట్ బ్రేక్ - ఫోర్ పిస్టన్ బ్రేక్ కాలిపర్, ర్యాడికల్లీ సిమ్మెట్రిక్ సీల్డ్-ఆఫ్ రిమ్ బ్రేక్, బ్రేక్ డిస్క్ ఏ 300 మి.మీ.

రియర్ బ్రేక్ - సింగిల్ పిస్టన్ బ్రేక్ కాలిపర్, ఫ్లోటింగ్ కాలిపర్ బ్రేక్, బ్రేక్ డిస్క్ ఏ 230 మి.మీ.

వీల్స్, టైర్స్, సైలెన్సర్

వీల్స్, టైర్స్, సైలెన్సర్

వీల్స్ ఫ్రంట్/రియర్ - కాస్ట్ అల్యూమినియం వీల్స్ 3.00 x 17 “, 4.00 x 17″

టైర్స్ ఫ్రంట్/రియర్ -110/70 ZR 17, 150/60 ZR 17

సైలెన్సర్ - ఆక్రాపోవిక్ టైటానియం సైలెన్సర్ విత్ రెగ్యులేటెడ్ క్యాటలిస్ట్ కన్వర్టర్

కొలతలు

కొలతలు

స్టీరింగ్ హెడ్ యాంగిల్ - 66.5 °

వీల్ బేస్ - 1340 + / -15 మి.మీ.

సీట్ హైట్- 850 మి.మీ. (33.5 ఇంచ్‌లు)

ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ - 9.5 లీటర్లు

బరువు - 130 కేజీలు

More from DriveSpark

Article Published On: Tuesday, July 16, 2013, 11:06 [IST]
English summary
As expected, KTM has pulled the wraps off a fully faired small displacement sports bike - KTM RC390 Cup. The new bike is currently only race homologated, meant to participate in the 2014 ADAC Junior Cup Powered by KTM. However, a production version of the same has also been officially confirmed, set for 2014 launch.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+