టోక్యోలో కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ
స్పోర్ట్స్ బైక్‌లు, రేస్ బైక్‌లను తయారు చేసే కంపెనీ, ఎలక్ట్రిక్ బైక్‌ను తయారు చేస్తే ఎలా ఉంటుంది..? ఇదిగో ఈ ఫోటోలలో కనిపిస్తున్న మాదిరిగానే ఉంటుంది. ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ బైక్‌ల తయారీ కంపెనీ ఓ సరికొత్త ఎలక్ట్రిక్ డర్ట్ బైక్‌ను అభివృద్ధి చేసింది. పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండేలా జీరో ఎమిషన్‌తో కూడిన డర్ట్ బైక్‌ను తయారు చేయాలనే లక్ష్యంతో 'కెటిఎమ్ ఫ్రీరైడ్ ఈ' (KTM Freeride E) అనే కాన్సెప్ట్‌ను కెటిఎమ్ రూపొందించింది.
ఈ అధునాతన కెటిఎమ్ ఫ్రీరైడ్ ఈ ఎలక్ట్రిక్ బైక్‌తో పాటుగా 'కెటిఎమ్ ఈ-స్పీడ్' (KTM E-Speed) అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా కంపెనీ తయారు చేసింది. కెటిఎమ్ ఈ రెండు కాన్సెప్ట్‌లను టోక్యో మోటార్‌సైకిల్ షోలో ఆవిష్కరించింది. ఫ్రీరైడ్ ఈ బైక్ మాదిరిగానే ఈ-స్పీడ్ స్కూటర్ కూడా ఎలాంటి పర్యావరణ, శబ్ధ కాలుష్యాలను కలిగించదు. భవిష్యత్తులో పట్టణ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కెటిఎమ్ ఈ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది. ఇది చూడటానికి స్పోర్టీ టూవీలర్‌లా ఉంటుంది. వీటికి సంబంధించిన మరింత సమాచారాన్ని క్రింది ఫోటో ఫీచర్‌లో పరిశీలించండి.

కెటిఎమ్ ఫ్రీరైడ్ ఈ కాన్సెప్ట్
కెటిఎమ్ జీరో ఎమిషన్ ఆఫ్‌రోడ్ స్పోర్ట్ మోటార్‌సైకిల్ ఫ్రీరైడ్ ఈ కాన్సెప్ట్, కంపెనీ యొక్క తొలి ఎలక్ట్రిక్ టూవీలర్. ఇందులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 29.5 హెచ్‌పిల శక్తిని విడుదల చేస్తుంది.

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్
కెటిఎమ్ అభివృద్ధి చేసిన రెండవ ఎలక్ట్రిక్ టూవీలర్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్‌లో లిథియం అయాన్ బ్యాటరీల ద్వారా పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ బ్యాటరీ కేవలం 2 గంటలలోనే పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఇందులో రీజరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అంటే బ్రేక్ వేసిన ప్రతిసారి ఉత్పత్తి శక్తితో ఈ బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి.

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్
కెటిఎమ్ పేర్కొన్న సమాచారం ప్రకారం ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 11 కి.వా. శక్తిని, 36 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్
309 పౌండ్ల బరువు కిలిగిన కెటిఎమ్ ఈ-స్పీడ్ గరిష్టంగా గంటకు 85 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. బ్యాటరీ ఫుల్ చార్జ్‌పై 40 మైళ్ల దూరం ప్రయాణించవచ్చు.

కెటిఎమ్ ఈ-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్
హైబ్రిడ్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, డబ్ల్యూపి సస్పెన్షన్ ఎలిమెంట్స్, బరువును మోసే మరియు ఫ్రేమ్‌కు సపోర్టుగా నిలిచే అల్యూమినియం బ్యాటరీ కేసింగ్‌లు ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన ఫీచర్లు.


Click it and Unblock the Notifications








