లిట్ మోటార్స్ నుంచి క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

By Ravi

స్కూటర్లలో మనం ఇప్పటికే అనేక రకాలను చూశాం. కానీ ఇప్పుడు మనం చూడబోయేది మాత్రం పూర్తిగా విభిన్నమైన స్కూటర్. స్కూటర్‌ను కేవలం పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ కోసం మాత్రమే కాకుండా, రవాణా (కార్గో) కోసం కూడా ఉపయోగించుకోవచ్చని చెబుతోంది లిట్ మోటార్స్. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన లిట్ మోటార్స్ ఓ అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తయారు చేసింది.

ఈ స్కూటర్ పేరు 'క్యూబో'. ఇదొక చిన్నపాటి రవాణా స్కూటర్. ముందువై ఓ పెద్ద కాటన్ బాక్సును లేదా కొంత లగేజ్‌ను ఉంచుకొని ఎంచక్కా దీనిపై సవారీ చేయవచ్చు. కంపెనీ దీనిని 'పికప్ ట్రక్ ఆన్ టూ వీల్స్' (రెండు చక్రాలపై పికప్ ట్రక్) అని అభివర్ణిస్తోంది. ఇలాంటి విశిష్టమైన, వినూత్నమైన ఉత్పత్తులు తయారు చేయటంలో లిట్ మోటార్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఓ ప్రత్యేకమైవ గుర్తింపు ఉంది.

గతంలో లిట్ మోటార్స్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ టూవీలర్‌ను తయారు చేసి ఔరా అనిపించుకుంది. మరి ఈ కొత్త క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రండి..!

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్‌ ముందు వైపు 22 ఇంచ్‌ల చదరపు కార్గో స్పేస్ ఉంటుంది. ఇందులో ఉంచే వస్తువులు జారిపోకుండా ఉండేందుకు క్రింది భాగంలో రబ్బర్ మ్యాట్, సైడ్స్‌లో హుక్స్ ఉంటాయి. వీటి సాయంతో కార్గోను సురక్షితంగా రవాణా చేయవచ్చు.

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

లిట్ మోటార్స్ తెలిపిన సమాచారం ప్రకారం, క్యూబో స్కూటర్‌పై 136 కేజీల బరువును తీసుకువెళ్లవచ్చట. ఇందులో రైడర్ బరువును కలిసి ఉండదు. ఇది ప్రత్యేకించి లగేజ్ బరువు మాత్రమే. వారంతో సరుకులు తెచ్చుకోవడానికి ఈ లగేజ్ సామర్థ్యం సరిపోతుంది.

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్‌లో లగేజ్ స్పేస్‌కు అదనంగా ఫోన్లు మొదలైన చిన్నపాటి వస్తువులను భద్రంగా దాచుకునేందుకు లాకబల్ కంపార్ట్‌మెంట్స్ కూడా ఉంటాయి. వీటిలో విలువైన వస్తువులను తాళం వేసి దాచుకోవచ్చు.

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

లిట్ మోటార్స్ క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్ 3 కి.వా. హై టార్క్ రియర్ హబ్ మోటార్ సాయంతో నడుస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్‌ను నేరుగా వెనుక చక్రాలకే అమర్చబడి ఉంటుంది. బ్రేక్ వేసినప్పుడల్లా శక్తి పునరుత్పత్తి అవుతుంది.

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 72.42 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో బ్యాటరీ, పూర్తి ఛార్జ్‌పై 80.46 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

ఇందులో మీ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్‌ను చార్జ్ చేసుకునేందుకు ఓ ఆన్-బోర్డ్ ఎలక్ట్రిక్ అవుట్‌లెట్ కూడా ఉంటుంది. అయితే, దీని ఉపయోగిస్తే క్యూబో రేంజ్ (మైలేజ్) తగ్గిపోతుంది.

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

పొట్టివాళ్లు, పొడుగువాళ్లు ఎవరైనా ఈ స్కూటర్‌ను నడపొచ్చు. అందుకు వీలుగా ఈ స్కూటర్‌లో హైట్ అడ్జస్టబల్ సీట్ ఉంటుంది. అంటే సీటును మన ఎత్తుకు తగినట్లుగా సర్దుబాటు చేసుకోవచ్చన్నమాట. సీట్‌నే కాకుండా సస్పెన్షన్‌ను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

క్యూబో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో చెప్పుకోదగిన ఫీచర్లలో ఇంటిగ్రేటెడ్ డిజిటల్ స్పీడోమీటర్, ఓడోమీటర్, బ్యాటరీ చార్జింగ్ ఇండికేటర్, ఎల్ఈడి హెడ్‌లైట్, టెయిల్ లైట్ ప్రధానమైనవి.

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

లిట్ మోటార్స్ తయారు చేసిన ఈ క్యూబో ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తిగా 100 శాతం ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఎలాంటి కర్భన ఉద్ఘారాలను విడుదల చేయదు. అంటే, ఇది పూర్తిగా ప్రకృతి సాన్నిహిత్యమైనది అన్నమాట.

క్యూబో ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్

లిట్ మోటార్స్ ఈ క్యూబో పర్సనల్ ఎలక్ట్రిక్ కార్గో స్కూటర్‌ను పూర్తిస్థాయిలో వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేందుకు పెట్టుబడిదారుల కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు లిట్ మోటార్స్ తమ ఉత్పత్తిని పెట్టుబడిదారుల ఆసక్తి కోసం కిక్‌స్టార్టర్ పేజ్‌లో ఉంచింది.

క్యూబో ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరును చూపించే వీడియోను ఈ స్లైడ్‌లో వీక్షించండి. ఇలాంటి అద్భుతమైన స్కూటర్లు మనకు కూడా అందుబాటులోకి వస్తే ఎంత బాగుంటుందో కదా..!

More from DriveSpark

Article Published On: Wednesday, November 27, 2013, 10:26 [IST]
English summary
Lit Motors, a company based in San Francisco, California has built an electric scooter with an unique take. Called the Kubo, its makers describe it as a pickup truck on two wheels. While that's not a perfect description what the Kubo is, is an electric cargo scooter.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+