నూతన సంవత్సర కానకగా వస్తున్న వెస్పా 125 స్కూటర్
ఇటాలియన్ ఆటో దిగ్గజం పియాజ్జియో భారత మార్కెట్ కోసం మరో సరికొత్త స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు మేము ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. తాజా అప్‌డేట్ ప్రకారం, పియాజ్జియో ఓ స్పోర్ట్ వెర్షన్ 125సీసీ స్కూటర్‌ను ఈ కొత్త సంవత్సరంలో విడుదల చేయనుంది. ప్రస్తుతం పియాజ్జియో భారత్‌లో తమ పురాతన వెస్పా బ్రాండ్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునేందుకు సన్నాహాలు చేస్తుంది.
ఇందులో భాగంగానే, గ్లోబల్ మార్కెట్లలో వెస్పా అందిస్తున్న స్పోర్టీయర్ 'వెస్పా 125 స్పోర్ట్' (Vespa 125 Sport) స్కూటర్‌ను దేశీయ విపణిలో కూడా విడుదల చేయాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న వెస్పా ఎల్ఎక్స్, వెస్పా విఎక్స్‌లను మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్న నేపథ్యంలో, ఈ కొత్త వెస్పా ఎస్ స్కూటర్‌ను ప్రత్యేకించి పురుషులను టార్గెట్‌గా చేసుకొని మార్కెట్లోకి తీసుకురానున్నారు.
ఈ స్కూటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

వెస్పా ఎస్ అంటే వెస్పా స్పోర్ట్ అని అర్థం. ఈ స్కూటర్ కూడా స్పోర్టీయర్ లుక్‌ను, పెర్ఫామెన్స్‌ను కలిగి ఉండనుంది. దీని ధరను ఎల్ఎక్స్, విఎక్స్ మోడళ్ల రేంజ్‌లో నిర్ణయించే ఆస్కారం ఉంది.

వెస్పా ఎస్ మోడల్ బేసిక్ డిజైన్ వెస్పా ఎల్స్ఎక్స్ 125 మాదిరిగానే ఉంటుంది. అయితే, దీనికి ముందువైపు పురాతన మోడళ్లలో కనిపించినట్లుగా దీర్ఘచతుస్రాకారపు హెడ్‌లైట్ ఉంటుంది.

ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా గతంలో మోడళ్ల నుంచి స్ఫూర్తిపొంది డిజైన్ చేసినదే. ఇందులో అనలాగ్ స్పీడోమీటర్, ఫ్యూయెల్ గేడ్ మరియు డిజిటల్ క్లాక్ ఉంటాయి.

ఇంజన్ విషయానికి వస్తే, ప్రస్తుతం భారత్‌లో కంపెనీ అందిస్తున్న 125సీసీ ఇంజన్‌నే ఈ కొత్త వెస్పా ఎస్ స్కూటర్‌లోను ఉపయోగించనున్నారు. అయితే, దీనిని స్వల్పంగా ట్యూనే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ స్కూటర్‌కు ముందువైపు ఒక వైపు మాత్రమే ఉండే షాక్ అబ్జార్వర్, ట్రేడ్ మార్క్ పొందిన వెస్పా మోనోకాక్ ఛాస్సిస్‌లను వెస్పా ఎస్ స్కూటర్‌లో గమనించవచ్చు.

నేటి ఆధునిక యువతను దృష్టిలో ఉంచుకొన పియాజ్జియో ఈ వెస్పా ఎస్ స్కూటర్‌ను అభివృద్ధి చేసింది.

ఈ స్కూటర్‌లో కూడా వెస్పా విఎక్స్ 125 మాదిరిగానే ముందువైపు డిస్క్ బ్రేక్‌ను కంపెనీ ఆఫర్ చేసే ఆస్కారం ఉంది.

ఈ స్కూటర్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








