లిమిటెడ్ ఎడిషన్ డ్రీమ్ యుగ బైక్‌ను విడుదల చేసిన హోండా

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఎమ్ఎస్ఐ) భారత మార్కెట్లో విక్రయిస్తున్న బడ్జెట్ మోటార్‌సైకిల్ 'హోండా డ్రీమ్ యుగ' (Honda Dream Yuga)లో ఓ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌ను నేడు (బుధవారం) మార్కెట్లో విడుదల చేసింది. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని విడుదల చేసిన లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్ డ్రీమ్ యుగ ధర రూ.45,164 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

లిమిటెడ్ ఎడిషన్ హోండా డ్రీమ్ యుగ మోటార్‌సైకిల్‌లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. అయితే, ఇది స్టయిలిష్ డ్యూయెల్ టోన్ కలర్స్ (రెండు కలయికతో కూడిన డిజైన్), ఫ్యూయెల్ ట్యాంక్‌పై 3డి లోగో, బాడీ కలర్డ్ గ్రాబ్ రెయిల్స్, బాడీకలర్డ్ రియర్ వ్యూ మిర్రర్స్, క్రోమ్ ప్లేటెడ్ మఫ్లర్ (సైలెన్సర్) కవర్ ఫీచర్లతో లభిస్తుంది. ఇంజన్ ఎలాంటి మార్పులు లేవు.

కొత్త హోండా డ్రీమ్ యుగ లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసిన సందర్భంగా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) యాద్విందర్ ఎస్ గులెరియా మాట్లాడుతూ.. డ్రీమ్ యుగను విడుదల చేసిన తొలి సంవత్సరంలోనే 3 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయని, ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మరియు రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో కొత్త వేరియంట్‌ను విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ డ్రీమ్ యుగ యువ వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Limited Edition Honda Dream Yuga

హోండా బడ్జెట్ బైక్ డ్రీమ్ యుగలో ఉపయోగించిన హెచ్ఈటి టెక్నాలజీతో కూడిన 110సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ 7500 ఆర్‌పిఎమ్ వద్ద 9పిఎస్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది మూడు వేరియంట్ల (కిక్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + స్పోక్ వీల్స్, కిక్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + అల్లాయ్ వీల్స్, సెల్ఫ్ స్టార్ట్ + డ్రమ్ బ్రేక్స్ + అల్లాయ్ వీల్స్)లో ఐదు ఆకర్షనీయమైన రంగుల్లో (బ్లాక్, మాన్‌సూన్ గ్రే మెటాలిక్, ఆల్ఫా రెడ్ మెటాలిక్, ఫోర్స్ సిల్వర్ మెటాలిక్, మ్యాపల్ బ్రౌన్ మెటాలిక్) లభ్యమవుతుంది. ఇది లీటరుకు 74 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 4, 2013, 20:45 [IST]
English summary
Honda Motorcycle and Scooter India Pvt Ltd ( HMSI) on Wednesday launched limited edition of 'Dream Yuga' model at the same price of Rs 45,164 (ex-showroom Delhi) to tap youth in the upcoming festive season. The limited edition 'Dream Yuga' will be available in stylish dual tone colours.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+