లిమిటెడ్ ఎడిషన్ వెస్పా ఎలిగాంట్ స్కూటర్ ఆవిష్కరణ
ఇటాలియన్ ఆటోమొబైల్ బ్రాండ్ పియాజ్జియో, భారత మార్కెట్లో మరో సరికొత్త స్కూటర్‌ను ఆవిష్కరించింది. పియాజ్జియో తమ వెస్పా స్కూటర్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలినియోను విస్తరించే దిగశగా, ఈ బ్రాండ్‌లో 'వెస్పా ఎలిగాంట్' (Vespa Elegante) పేరుతో ఓ సరికొత్త స్కూటర్‌ను నేడు (సెప్టెంబర్ 16, 2014) మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ఇది వరకు పియాజ్జియో విడుదల చేసిన వెస్పా ఎస్‌క్లూజివో మాదిరిగానే వెస్పా ఎలిగాంట్ కూడా ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడలే. ఈ మోడల్ ఎక్స్‌క్లూజివిటినీ ప్రదర్శించేందుకు గాను ఇందులో ఓ ప్రత్యేకమైన ఎలిగాంట్ బ్యాడ్జ్‌ను అమర్చారు. వెస్పా ఎలిగాంట్ స్కూటర్ కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభ్యం కానుంది.

వెస్పా ఎలిగాంట్ స్కూటర్ ధరను సెప్టెంబర్ 20వ తేదీన కంపెనీ వెల్లడించనుంది. అదే రోజు నుంచే ఈ స్కూటర్ వాణిజ్య పరంగా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఇంజన్ విషయానికి వస్తే.. వెస్పా ఎలిగాంట్‌లో ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న ఇతర వెస్పా స్కూటర్లలో ఉపయోగిస్తున్న 125సీసీ ఇంజన్‌నే ఉపయోగించింది.
ఈ ఇంజన్ గరిష్టంగా 10.5 బిహెచ్‌పిల శక్తిని, 10.6 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కంటిన్యూస్ వేరియబల్ ట్రాన్సిమిషన్ (సివిటి) గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది. కేవలం రెండు నెలల కాలం పాటు 3500 యూనిట్ల వెస్పా ఎలిగాంట్ స్కూటర్లను మాత్రమే విక్రయించాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఒకవేళ ఈ మోడల్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటే, ఈ సంఖ్యను పెంచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








