వెస్పా ఎస్‌క్లూజివో లిమిటెడ్ ఎడిషన్; ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ దిగ్గజం పియాజ్జియోకి చెందిన ద్విచక్ర వాహన బ్రాండ్ వెస్పాలో కంపెనీ మొట్టమొదటి సారిగా భారత మార్కెట్లో ఓ స్పెషల్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. వెస్పా ఎల్ఎక్స్ వేరియంట్‌కు ఎగువ కంపెనీ విక్రయిస్తున్న వెస్పా విఎక్స్ వేరియంట్ (ప్రీమియం స్కూటర్)లో 'వెస్పా ఎస్‌క్లూసివో' (Vespa Esclusivo) అనే పేరుతో కంపెనీ ఓ స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను విడుదల చేసింది.

కేవలం 1000 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ వెస్పా ఎస్‌క్లూజివో స్కూటర్లను మాత్రమే విక్రయిస్తామని, ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్లలో ప్రతి స్కూటర్‌పై దాని యూనిట్ నెంబర్ బ్యాడ్జ్ ఉంటుందని పియాజ్జియో వెహికల్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. భారత మార్కెట్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ వెస్పా ఎస్‌క్లూజివ్ వేరియంట్ ధర రూ.74,355 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)లుగా నిర్ణయించినట్లు పియాజ్జియో పేర్కొంది.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

వెస్పా ఎస్‌క్లూజివో ఫీచర్స్

రెగ్యులర్ వెస్పా విఎక్స్ వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ లిమిటెడ్ ఎడిషన్ వెస్పా ఎస్‌క్లూజివో వేరియంట్‌ను తయారు చేశారు.

వెస్పా ఎస్‌క్లూజివో ఫీచర్స్

రెగ్యులర్ మరియు లిమిటెడ్ ఎడిషన్ వెస్పా విఎస్క్ స్కూటర్లకు మధ్య వ్యత్యాసాన్ని చూపే విధంగా దీనిని డ్యూయెల్ కలర్, బ్లాక్ అండ్ సిల్వర్ అల్లాయ్ వీల్స్‌తో ఆఫర్ చేస్తున్నారు. గ్రే టాప్ అండ్ బ్లాక్ సైడ్ థీమ్ సీట్ ఇందులో మరో ప్రత్యేకత.

వెస్పా ఎస్‌క్లూజివో ఫీచర్స్

వెస్పా ఎస్‌క్లూజివో లిమిటెడ్ ఎడిషన్ మోడల్ మొత్త మూడు రంగులలో లభిస్తుంది. అవి - మోట్ బియాంకో (తెలుపు), నీరో మ్యాట్ (నలుపు), రోసో డ్రాగన్ (ఎరుపు).

వెస్పా ఎస్‌క్లూజివో ఫీచర్స్

ఇవి మొత్తం 1000 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రతి యూనిట్‌పై దాని నెంబరు ముద్రించబడి ఉంటుంది. దేశీయ విపణిలో దీని ధర రూ.74,355 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

వెస్పా ఎస్‌క్లూజివో ఫీచర్స్

ఇంజన్ పరంగా కొత్త వెస్పా ఎస్‌క్లూజివో వేరియంట్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇందులో ఉపయోగించిన 125సీసీ ఇంజన్ గరిష్టంగా 10.06 బిహెచ్‌‌పిల శక్తిని, 10.8 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ సివిటి (కంటిన్యూస్లీ వేరియబల్ ట్రాన్సిమిషన్) ఆటోమేటిక్ గేర్‌బాక్సుతో జతచేయబడి ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, వెస్పా విఎక్స్ 125 లీటరుకు 60 కి.మీ. మైలేజీనిస్తుంది.

వెస్పా ఎస్‌క్లూజివో ఫీచర్స్

కొత్త వెస్పా ఎస్‌క్లూజివోలో సరికొత్త ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. ఇందులో ముందు వైపు 200 మి.మీ. డిస్క్ బ్రేక్‌తో లభిస్తుంది. అత్యవసర సమయాల్లో బ్రేక్ వేసినప్పుడు సురక్షతమైన బ్రేకింగ్‌కు ఇది దోహదపడుతుంది.

వెస్పా ఎస్‌క్లూజివో ఫీచర్స్

వెస్పా విఎక్స్ 125 స్కూటర్ కూడా ట్యూబ్‌లెస్ టైర్లతో లభిస్తుంది. ఇందులో ఎమ్ఆర్ఎఫ్ నైలాన్ గ్రిప్ జాపర్ ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగించారు. పంక్చర్‌లు అయినప్పుడు వెంటనే టైర్లలో గాలి బయటకు పోకుండా ఉండా ఉండేందుకు ఇవి సహకరిస్తాయి.

వెస్పా ఎస్‌క్లూజివో ఫీచర్స్

లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుడు డ్రైవ్‌స్పార్క్‌‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 10, 2014, 11:51 [IST]
English summary
The Italian manufacturer Piaggio, has launched an exclusive limited edition Vespa called the Vespa Esclusivo. Only 1,000 units will be made. This scooter, launched targeting the youth, is all ready to make a fashion statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+