నావిగేషన్ డిస్‌ప్లేతో కూడిన లైవ్‌మ్యాప్ మోటార్‌సైకిల్ హెల్మెట్
ఈ కథనంలో మనం చెప్పుకోబోయే హెల్మెట్ ఆషామాషీ హెల్మెట్ కాదు. ప్రపంచ మన కళ్ల ముందు ఉంచే అత్యంత అధునాతన హెల్మెట్ ఇది. రష్యాకు చెందిన కంపెనీ 'లైవ్‌మ్యాప్' ఈ హెల్మెట్‌ను తయారు చేసింది. నావిగేషన్ డిస్‌ప్లేతో లైవ్ మ్యాప్‌లను హెల్మెట్ విండ్‌షీల్డ్‌పై చూపించటం దీని ప్రత్యేకత. బైకర్ల కోసం హ్యాండ్స్ ఫ్రీ నావిగేషన్‌ను అందించాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ హెల్మెట్‌ను రూపొందించింది.
సాధారణం కార్లలో అయితే, ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే సిస్టమ్ ద్వారా నావిగేషన్ సౌకర్యాన్ని పొందవచ్చు లేదా ఇతర గ్యాడ్జెట్ల సాయంతో ఈ సమాచారాన్ని పొందవచ్చు. కానీ బైకర్ల విషయంలో పలు కారణాల ఇలాంటి సదుపాయాలు లేవు. కొన్ని రకాల హై-ఎండ్ బైక్‌లలో ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌కే ఈ నావిగేషన్ సిస్టమ్‌ను జోడించబడి ఉంటుంది. అయితే, సదరు బైక్‌ల ధర కూడా అధికంగానే ఉంటుంది.
కోంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలట్లు ధరించే ఫ్లైట్ హెల్మెట్లలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని ఈ అధునాతన హెల్మెట్‌ను తయారు చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే ఐరన్ మ్యాన్ సినిమాలో హీరో ధరించే సూట్ హెల్మెట్ స్క్రీన్‌పై కనిపించే సమాచారం మాదిరిగానే ఈ హెల్మెట్ కూడా రోడ్, రూట్, ట్రావెల్‌కు సంబంధించిన నావిగేషన్ సమాచారాన్ని అందిస్తుంది. దీని ధర ఇతర వివరాలG, వీడియో కోసం క్రింది ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి..!

టెక్నాలజీ
ఈ లైవ్‌మ్యాప్ హెల్మెట్‌లో ఓ మైక్రోఫోన్, రెండు ఇయర్‌పీస్‌లు మరియు మైక్రోడిస్‌ప్లే ఉంటాయి. ఫ్లైట్ హెల్మెట్లలో ఉపయోగించే డిస్‌ప్లే టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఇది పనిచేస్తుంది. హెల్మెట్ విజర్‌పై సమాచారం కనిపిస్తుంది. ఇది దృష్టికి ఎలాంటి ఆటంకం కలిగించదు.

ఆండ్రాయిడ్ ఓఎస్
లైవ్‌మ్యాప్ హెల్మెట్ ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్ ద్వారా పనిచేస్తుంది. దీని ద్వారా లైవ్‌మ్యాప్, లొకోషన్ ఇన్‌ఫర్మేషన్, ఇతర నావిగేషన్ సదుపాయాలను పొందవ్చచు.

వాయిస్ కమాండ్ టెక్నాలజీ
యాపిల్ ఫోన్లలో ఉపయోగించే సిరి వాయిస్ రికగ్నైజింగ్ టెక్నాలజీ లాంటిదే ఈ లైవ్‌మ్యాప్ హెల్మెట్‌లో ఉపయోగించారు. మనం ఇచ్చే వాయిస్ కమాండ్ల ద్వారా ఇది ప్రాంతాలను గుర్తించి సమాచారం అందిస్తుంది. ఒకవేళ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఈ హెల్మెట్ స్థానిక హెల్ప్‌లైన్లకు సమాచారం అందిస్తుంది.

మరిన్ని ఫీచర్స్
లైవ్‌మ్యాప్ హెల్మెట్‌లో ఇంకా డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసే లైట్ సెన్సార్, జి-సెన్సార్, గైరోస్కోప్, డిజిటల్ కంపాస్ వంటి ఫీచర్లున్నాయి.

బ్యాటరీ
ఈ లైవ్‌మ్యాప్ హెల్మెట్ 3000ఎమ్ఏహెచ్ బ్యాటరీలతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీల సాయంతో హెల్మెట్ రోజంతా పనిచేస్తుంది.

ధర
లైవ్‌మ్యాప్ హెల్మెట్ ధర 1500 అమెరికన్ డాలర్లు. మనదేశ కరెన్సీలో రూ.8,000 లకు పైమాటే.


Click it and Unblock the Notifications








